logo

బాహుబలి 2 .. ఆ రికార్డును ఇప్పటివరకూ ఎవరూ టచ్ కూడా చేయలేదు!

బాహుబలి 2 .. ఆ రికార్డును ఇప్పటివరకూ ఎవరూ టచ్ కూడా చేయలేదు!
Highlights

తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచ సినిమాకు కాసుల రూపంలో పరిచయం చేసిన ఖ్యాతి బాహుబలి సినిమాదే. సొమ్ములు కొల్లగొట్టడం అనే మాటకు నిజమైన అర్థాన్ని చూపించిన తెలుగు సినిమా కూడా బాహుబలి. ముఖ్యంగా బాహుబలి 2 సృష్టించిన కలెక్షన్ల సునామీ ని ఇప్పటికీ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు కూడా మర్చిపోలేకపోతున్నాయి.

తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచ సినిమాకు కాసుల రూపంలో పరిచయం చేసిన ఖ్యాతి బాహుబలి సినిమాదే. సొమ్ములు కొల్లగొట్టడం అనే మాటకు నిజమైన అర్థాన్ని చూపించిన తెలుగు సినిమా కూడా బాహుబలి. ముఖ్యంగా బాహుబలి 2 సృష్టించిన కలెక్షన్ల సునామీ ని ఇప్పటికీ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు కూడా మర్చిపోలేకపోతున్నాయి. ఇక ఒక తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉందా అని హిందీ పరిశ్రమ వర్గాలు అప్పుడు ముక్కున వేలేసుకున్నాయి.. ఇప్పటికీ ఆ వేలును తీయడానికి వారికి అవకాశం రాలేదు. ఎందుకంటే.. దాదాపు రెండేళ్లు గడిచిపోయినా బాహుబలి 2 కలెక్షణాలని తలదన్నే.. ఇంకా చెప్పాలంటే దరిదాపుల్లోకి వెళ్లే సినిమా ఇప్పటివరకూ హిందీలో రాలేదు. అదీ బాహుబలి 2 ప్రభంజనం. ఎస్ ఎస్ రాజమౌళి కళల నుంచి తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ అందరికీ పెద్ద ఆశ్చర్యమే. ఇప్పుడు వస్తున్నా ఎన్నో సినిమాలు భారీతనంతో బాహుబలితో పోటీ పడటానికి ప్రయత్నిస్తున్నాయి కానీ, ఆ స్థాయిని అందుకునే పరిస్థితి మాత్రం ఏ సినిమాకీ రాలేదన్నది నిజం. ఆఖరుకు బాహుబలి హీరో ప్రభాస్ కూడా ఖర్చు ఆ స్థాయిని మించి చేసినా.. కలెక్షన్ల పరంగా దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయాడు. అదీ బాహుబలి కె చెల్లిన కలెక్షన్ల ఆట.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1,800 కోట్లు రాబట్టింది అంచనా. ఒక్క హిందీలోనే పది రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టిందని కలెక్షన్స్ రిపోర్టులు అందించే తరం ఆదర్శ్ చెబుతున్నారు. ఆయన లెక్కల ప్రకారం బాహుబలి రికార్డును ఇప్పటివరకూ ఏ చిత్రమూ టచ్ కూడా చేయలేకపోయింది. దానికి ఉదాహరణలుగా ఇటీవల కాలంలో విడుదలైన హిందీ సినిమాల కలెక్షన్ల వివరాలను చెప్పుకొచ్చారాయన. 2019లో విడుదలైన హిందీ సినిమాలు 'వార్‌ ఏడు రోజుల్లో, 'కబీర్‌ సింగ్‌ 18 రోజుల్లో, 'భారత్‌' రూ.14 రోజుల్లో, 'ఉరి' 28 రోజుల్లో, 'మిషన్‌ మంగళ్‌ 29 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేశాయని అన్నారు. అదేవిధంగా వివిధ సంవత్సరాల్లో హిట్లుగా నిలిచిన హిందీ సినిమాలు 'సంజు' ఏడు రోజుల్లో 'టైగర్‌ జిందా 'ప్పై' ఏడు రోజుల్లో, 'సుల్తాన్‌ ఏడు రోజుల్లో, 'దంగల్‌ ఎనిమిది రోజుల్లో, 'పీకే ఎనిమిది రోజుల్లో 'బజరంగీ భాయ్‌జాన్‌ తొమ్మిది రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.200 కోట్లను చేరుకున్నాయి.

ఈ లెక్కలు చూస్తుంటే రాజమౌళి అద్భుతానికి ఎప్పటికీ తిరుగులేదనిపిస్తోంది. మళ్ళీ ఆ రికార్డులను ఆయనే తిరగరాస్తారనిపిస్తోంది.




లైవ్ టీవి


Share it
Top