7 years for 'Baahubali' first day : బాహుబలి మొదటి మెట్టుకు ఏడేళ్ళు!

7 years for Baahubali first day : బాహుబలి మొదటి మెట్టుకు ఏడేళ్ళు!
x
Highlights

7 years for 'Baahubali' first day : టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.

7 years for 'Baahubali' first day : టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి.. అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.. నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ అంటే బాహుబలి ముందు బాహుబలి తరవాత అని చెప్పుకోవచ్చు.. టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చిన సంగతి తెలిసిందే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి మొదటి అడుగు పడి నేటికి ఏడేళ్ళు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో పాటుగా అభిమానులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

2013 జులై 6న బాహుబలి షూటింగ్ చాలా గ్రాండ్ గా మొదలైంది. ఫేమస్ రాక్ గార్డెన్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ని చూసేందుకు చాలా మంది అభిమానులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. జనాల మధ్యలోనే దర్శకుడు రాజమౌళి షూటింగ్ ని మొదలు పెట్టి ప్రభాస్ పై తొలి సన్నివేశాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 జులై 10న విడుదల చేయగా , సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాకి కలెక్షన్ల వర్షం కురిసింది. దాదాపుగా ఫస్ట్ పార్ట్ 600 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించగా, రాజమౌళి సోదరుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిచాడు.

ఇంట్రెస్టింగ్ పాయింట్స్ :

ఓ నది దాటుతూ ఓ బిడ్డని కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన శివగామి పాత్ర నుంచి ఈ కథకి బీజం పడింది.

ఆ తరువాత కొన్నేళ్ళకు కట్టప్ప పాత్రను క్రియేట్ చేయగా ఈ సినిమాపైన రాజమౌళికి పూర్తి నమ్మకం వచ్చింది.

ఈ కథ మొదటి డ్రాఫ్టుని పూర్తి చేయడానికి రచయితలకు మూడు నెలలు సమయం పట్టింది.

ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి "కిలికిలి" లేదా "కిలికి" అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు.

ఒక సినిమా కోసం ఓ భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే మొదటిసారి కావడం మరో విశేషం.

శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. కానీ శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు. ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి.

ఈ సినిమాలోని తమ పాత్రలకు అనుగుణంగా ప్రభాస్, అనుష్క, రానాలు కత్తిసాము నేర్చుకోగా, ప్రభాస్, రానాలు అదనంగా గుర్రపుస్వారీలు నేర్చుకోవడం జరిగింది.

మొత్తం 15 విభాగాలలో ఈ సినిమాకి నంది అవార్డులు లభించాయి.

భారతీయ ప్రేక్షకులు మెచ్చిన ఈ సినిమాని చైనీయులు తిప్పి కొట్టారు. అక్కడ ఈ సినిమా ప్లాప్ ను మూటగట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories