బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న 'అర్జున్ రెడ్డి' పిల్ల

బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న అర్జున్ రెడ్డి పిల్ల
x
Highlights

విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవడంతో ఆమెకు మంచి పేరే దక్కింది.

విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవడంతో ఆమెకు మంచి పేరే దక్కింది. కానీ ఆఫర్లు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం తమిళంలో '100 % లవ్' రీమేక్లో నటిస్తున్న ఈమె ఈ మధ్యనే టాలీవుడ్లో 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో కనిపించింది. హీరోయిన్ గా కళ్యాణ్ రామ్ సరసన '118' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్న షాలిని పాండే కు ఈ మధ్య ఒక బంపర్ ఆఫర్ వచ్చింది.

బాలీవుడ్ లో పరేష్ రావల్ కుమారుడు హీరోగా నటిస్తున్న 'బాంఫాడ్' సినిమా లో షాలిని పాండే కు హీరోయిన్ గా అవకాశం దక్కింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన లేక నిర్మాణంలో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా కచ్చితంగా హిట్ అవుతాయని తెలిసిందే. ఇక అలాంటి దర్శకుడి సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్లో అడుగు పెట్టటం షాలిని అదృష్టం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లను కవర్ చేస్తున్న ఈమె బాలీవుడ్లో ఎంతవరకు రాణించగలదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories