పాయల్‌ ఆరోపణలు అవాస్తవం: అనురాగ్‌ కశ్యప్‌

Anurag Kashyap Responds : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ పైన నటి పాయల్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..

Krishna
Published on: 20 Sept 2020 1:44 PM IST
పాయల్‌ ఆరోపణలు అవాస్తవం: అనురాగ్‌ కశ్యప్‌
X

Payal Ghosh, Anurag Kashyap

Anurag Kashyap Responds : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ పైన నటి పాయల్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనురాగ్‌ కశ్యప్‌ పైన కీలక వాఖ్యలు చేశారు. తనతో ఎదో మాట్లాడలని చెప్పి ఇంటికి రమ్మని చెప్పి అనురాగ్‌ కశ్యప్‌ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని పాయల్‌ ఘోష్‌ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అయితే ఆ వాఖ్యాలపైన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవన్నారు. ఈ మేరకు అయన ట్విటర్‌ వేదికగా పలు ట్వీట్లు చేశారు.

ఆమె చేసిన ఆరోపణల వలన చాలా మంది నుంచి ఫోన్స్, మెస్సేజ్‌లు వచ్చినట్టుగా అనురాగ్‌ కశ్యప్‌ వెల్లడించాడు. అయితే ఆమె చేసిన ఆరోపణలకి ఎవరు స్పందిన్చావద్దునని చెప్పినప్పటికీ నటి పాయల్‌ ఘోష్‌ కి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా వెల్లడించాడు. ఒక మహిళ అయిన మీరు.. నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలున్నాయంటూ ఆరోపించడం తప్పుగా అనిపించలేదా? అంటూ అనురాగ్‌ కశ్యప్‌ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు..

అంతేకాకుండా నాపైన ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసే క్రమంలో బచ్చన్‌ కుటుంబంతో పాటుగా పలువురు నటీమణులను ఇందులోకి తీసుకువచ్చారు. కానీ పూర్తిగా విఫలమయ్యారు. నేను దర్శకుడిగా చాలా మంది హీరోయిన్ లతో మాట్లాడుతుంటాను.. కానీ, ఎప్పుడూ వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించలేదు. మీరు చేసిన ఆరోపణలలో ఎంత నిజం ఉందొ భవిష్యత్తులోనే తెలుస్తుంది అంటూ ట్వీట్ చేశాడు. ఇక గతంలో అనురాగ్‌ కశ్యప్‌ ఎడిటర్ ఆర్తి, నటి కల్కీ కోచ్లిన్ లను వివాహం చేసుకొని వారి నుంచి విడాకులను పొందారు.

Krishna

Krishna

Next Story