Rhea Chakraborty Gets Arrested : రియా అరెస్ట్ : సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఆసక్తికర పోస్ట్!

Rhea Chakraborty Gets Arrested : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఏ1 నిందితురాలుగా ఆరోపణలు ఎదురుకుంటున్న నటి

Krishna
Published on: 9 Sept 2020 1:30 PM IST
Rhea Chakraborty Gets Arrested : రియా అరెస్ట్ :  సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఆసక్తికర పోస్ట్!
X

Rhea Chakraborty

Rhea Chakraborty Gets Arrested : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఏ1 నిందితురాలుగా ఆరోపణలు ఎదురుకుంటున్న నటి రియా చక్రవర్తిని ఎన్‌సీబీ నిన్న (మంగళవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లుగా ఎన్‌సీబీ వెల్లడించింది. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కేసులో ప‌లువురిని అరెస్టు చేశారు. అందులో రియా చక్రవర్తి సోద‌రుడు షోవిక్ తో పాటు సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ సామ్యూల్ కూడా ఉన్నారు.

అయితే రియాని అరెస్ట్ చేసిన తరువాత సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది. " అనుకోకుండా ఏదీ దానంతట అదే జరగదు, విధి వల్లే జరుగుతుంది.. నీ చర్యల ద్వారా నీ దురదృష్టాన్ని సృష్టించుకున్నావు. అదే కర్మ " అంటూ జస్టిస్ అనే క్యాప్షన్ ని జతపరిచింది అంకితా లోఖండే.. అంకితా పోస్ట్‌కు అనేక మంది నుంచి మద్దతు లభిస్తుంది. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి కూడా ఆమెను అభినందించారు.

సుశాంత్ మరణించినప్పటి నుంచి అంకితా లోఖండే సుశాంత్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ వస్తుంది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది అంకితా.. సుశాంత్ మరియు అంకితా 2010 నుండి 2016 వరకు రిలేషన్ లో ఉన్నారు. హిట్ టీవీ షో 'పవిత్ర రిష్ట' సెట్స్‌లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాల తరువాత, సుశాంత్ ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టి సినిమాల్లో కెరీర్ ని మొదలుపెట్టాడు..

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న ముంబై లోని తన నివాసంలో చనిపోయాడు.. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్య అని పలువురు కామెంట్స్ చేయడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరియు సంబంధిత మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పరిశీలిస్తోంది.

Krishna

Krishna

Next Story