Anikha Surendran: క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

Anikha Surendran: కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన "విశ్వాసం" సినిమాలో అజిత్ కూతురు పాత్రలో కనిపించిన అనిఖా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

admin1
Published on: 11 Aug 2021 9:22 PM IST
Anikha Surendran Bags Two Telugu Movies
X

Anikha Surendran: క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు..

Anikha Surendran: కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన "విశ్వాసం" సినిమాలో అజిత్ కూతురు పాత్రలో కనిపించిన అనిఖా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అనిఖా సురేంద్రన్ తాజాగా రెండు తెలుగు సినిమాలను సైన్ చేసి తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైస్ ఇచ్చింది. ఈ మధ్యన "వైల్డ్ డాగ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది అనిఖా.

మరో వైపు "బుట్ట బొమ్మ" అనే ఒక తెలుగు సినిమాలో కూడా అనిఖా హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన "కప్పేలా" సినిమా తెలుగు రీమేక్ గా "బుట్ట బొమ్మ" త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మొన్నీమధ్యనే హీరోయిన్ అయిన అనిఖా అప్పుడే రెండు సినిమా ఆఫర్లను చేజిక్కించుకుని అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న అనిఖా ఇప్పుడు హీరోయిన్ ఎంతవరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

admin1

admin1

Next Story