రవితేజ సినిమా డిస్ట్రిబ్యూటర్ లకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రవితేజ సినిమా డిస్ట్రిబ్యూటర్ లకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Ravi Teja Movie: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయంతో ఖంగుతిన్న "ఖిలాడీ" దర్శకనిర్మాతలు
Ravi Teja Movie: ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ త్వరలోనే "ఖిలాడీ" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "క్రాక్" సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే 20 కోట్లకు పైగా బిజినెస్ చేసి అందరినీ ఆకర్షిస్తోంది. అంతా సజావుగా జరుగుతుందన్న సమయంలో దర్శకనిర్మాతలకు ఒక పెద్ద ఇబ్బంది ఎదురైంది. ఫిబ్రవరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ ఎత్తేసి 100% ఆక్యుపెన్సీ ఇస్తుందనే నమ్మకం తో దర్శక నిర్మాతలు సినిమాని ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఫిబ్రవరి 14 దాకా కొనసాగుతుంది అని చెప్పడంతో దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఖంగుతిన్నారు. ఈ నేపథ్యంలోనే అనుకున్న అమౌంట్ కంటే కొంచెం రాయితీ కావాలని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం తగ్గటం లేదని తెలుస్తోంది. కావాలంటే సినిమాని వాయిదా వేసినా పర్లేదు కానీ సినిమా రైట్స్ విషయంలో రాయితీ కుదరదని చెబుతున్నారు. డింపుల్ హాయతి మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రమేష్ వర్మ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో స్థానికుల వినూత్న నిరసన
26 Jun 2022 4:48 AM GMTICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఇక అన్ని...
26 Jun 2022 4:30 AM GMTనాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటున్న రాశి ఖన్నా
26 Jun 2022 4:23 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTగుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లా గొండాల్‌లో భారీ వర్షం
26 Jun 2022 3:00 AM GMT