చిక్కుల్లో ఆర్య.. కోర్టు నోటిసులు!

Hero Arya : ఒక్కోసారి నటులు డైరెక్ట్ గా వివాదాల్లో చిక్కుకోకున్నప్పటికి వారు నటించిన సినిమాల ద్వారా వివాదాస్పదం అవుతాయి.

Krishna
Published on: 20 Sept 2020 12:53 PM IST
చిక్కుల్లో ఆర్య.. కోర్టు నోటిసులు!
X

arya 

Hero Arya : ఒక్కోసారి నటులు డైరెక్ట్ గా వివాదాల్లో చిక్కుకోకున్నప్పటికి వారు నటించిన సినిమాల ద్వారా వివాదాస్పదం అవుతాయి.. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది.. ఏళ్ల క్రితం ఆర్య నటించిన అవన్‌ ఇవన్‌ చిత్రం ఆయన్ని ఇప్పుడు కోర్టుకు లాగుతోంది. తమిళ దర్శకుడు బాల దర్శకత్వంలో 9 ఏళ్ల క్రితం వచ్చిన అవన్‌ ఇవన్‌ (తెలుగులో 'వాడు వీడు') చిత్రం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది.

ఈ సినిమాలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు చోటుచేసుకున్నాయంటూ నెల్లై జిల్లా, అంబాసముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపైన విచారణ చెప్పట్టింది. అందులో భాగంగా ఆర్య ఈ నెల 28న హాజరు కావాల్సిందిగా అంబాసముద్రం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ వివాదం ఆర్యతోనే ముగుస్తుందా లేకా చిత్ర యూనిట్ కి ఏమైనా సమస్యగా మారనుందా అన్నది చూడాలి..

ఇక హీరో ఆర్య విషయానికి వచ్చేసరికి తెలుగు, మలయాళ, తెలుగు భాషలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విలన్ గా కూడా నటించి మెప్పించాడు ఆర్య.. ఇక తన కో స్టార్ సయాషా సైగల్ ని గత ఏడాది వివాహం చేసుకున్నాడు. సయాషా సైగల్ అఖిల్ హీరోగా వచ్చిన అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Krishna

Krishna

Next Story