నాగ్ సరసన మళ్ళీ నటించనున్న అమల

Ruthvik
Published on: 10 Feb 2019 1:07 PM IST
నాగ్ సరసన మళ్ళీ నటించనున్న అమల
X

2002లో అక్కినేని నాగార్జున, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన 'మన్మధుడు' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ్ ఆ సినిమాకు సీక్వెల్ గా 'మన్మధుడు 2' సినిమా చేయనున్నారు. ఈమధ్యే 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ 'మన్మధుడు 2' సినిమా కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో నాగార్జున భార్య అమల ఒక కీలకపాత్ర పోషిస్తుందని సమాచారం.

అయితే ఈమధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న అమల 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత 'మనం' లో కూడా ఒక చిన్న కామియో లో నటించారు. కానీఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర అని అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున డబల్ రోల్ పోషిస్తున్నారని, తండ్రి నాగార్జున కి జోడీగా కొడుకు నాగార్జునకు తల్లిగా గా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే అలాంటిది ఏమి లేదని, అమల క్యామియో నిజమేకానీ కేవలం రెండు మూడు నిముషాలకంటే ఎక్కువగా ఉండదని అక్కినేని కాంపౌండ్ నుండి సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుంచి మొదలవనుంది.

Ruthvik

Ruthvik

Next Story