సునామీ సృష్టిస్తున్న బన్నీ సరైనోడు!

సునామీ సృష్టిస్తున్న బన్నీ సరైనోడు!
x
Highlights

బోయపాటి.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సినిమా సరైనోడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు...

బోయపాటి.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సినిమా సరైనోడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు చేశారు. బోయపాటి మార్క్ యాక్షన్ కి బన్నీ మార్క్ ఎనర్జీ తోడవడంతో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిసింది. 2016లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ సంచలనం సృష్టిస్తోంది. వెండి తెరపై కాదు.. యుట్యూబ్ తెరపై.

ఈ సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ సరైనోడికి యూట్యూబ్ ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఎంతలా అంటే, 2018లో అప్ లోడ్ చేసిన సినిమా ఇంత వరకూ 200 మిలియన్ల మంది చూసారు. యూట్యూబ్ లో 200 మిలియన్లు రాబట్టిన తొలి ఇండియన్ సినిమాగా సరైనోడు రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు అత్యధిక మంది లైక్ చేసిన మూవీ కూడా ఇదేనట. మామూలుగానే అల్లు అర్జున్ యూట్యూబ్ లో చాలా దమ్మున్నోడు! ఇప్పుడు ఈ సరైనోడితో మరో కొత్త రికార్డు సృష్టించాడు. తెలుగు తెరపై ఎవరేజ్ గా నిలిచినా దువ్వాడ జగన్నాధం సినిమా యూట్యూబ్ లో 150 మిలియన్ల వ్యూస్ నమోదు చేసింది. ఇది ఓ రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి.. సరైనోడు 200వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది.

సరైనోడు సినిమాను హిందీ అనువాద హక్కులను బాలీవుడ్‌కు చెందిన గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలోకి అనువాదం చేసి 'సరైనోడు' టైటిల్‌తోనే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఇప్పటి వరకూ యూట్యూబ్ లో దుమ్మురేపిన బన్నీ సినిమాలివే!

1. సరైనోడు - 200 మిలియన్, 2. దువ్వాడ జగన్నాథం - 152 మిలియన్, 3. రుద్రమదేవి - 75 మిలియన్, 4. సన్ ఆఫ్ సత్యమూర్తి - 58 మిలియన్, 5. ఆర్య 2 - 47 మిలియన్, 6. రేసుగుర్రం - 45 మిలియన్, 7. హ్యాపీ - 33 మిలియన్, 8. జులాయి - 32 మిలియన్, 9. ఇద్దరమ్మాయిలతో - 29 మిలియన్, 10. గంగోత్రి - 22 మిలియన్


Show Full Article
Print Article
More On
Next Story
More Stories