కాంతార తరువాత తోడేలు.. మరో డబ్బింగ్ సినిమాతో అల్లు అరవింద్..

* ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

R Tripura Malini
Updated on: 6 Nov 2022 9:00 PM IST
allu ravind to release a pan india film in telugu
X

"తోడేలు" సినిమాని విడుదల చేయబోతున్న అల్లు అరవింద్

Allu Aravind: గత కొంతకాలంగా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాల రీమిక్స్ రైట్స్ ను సొంతం చేసుకుంటున్నారు మెగా నిర్మాత అల్లు అరవింద్. వాటిని తెలుగులో రీమేక్ చేసి హిట్ అందుకుంటున్నారు. అంతేకాకుండా వాటిని తెలుగులో డబ్ చేసి మరీ మంచి విజయాన్ని సాధిస్తున్నారు. తాజాగా రిషబ్ శెట్టి హీరోగా కన్నడలో సూపర్ హిట్ అయిన "కాంతారా" సినిమా ను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసి మంచి హిట్ అందుకున్నారు అల్లు అరవింద్.

తాజాగా ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. హిందీలో వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న "భేడియా" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

అంతేకాకుండా ఆ సినిమాలో ఉన్న కామెడీ కూడా చాలా బాగుందని ఎంత ఫాంటసీ ఎలిమెంట్లు ఉన్నప్పటికీ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ సినిమాని "తోడేలు" అనే టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అల్లు అరవింద్ ఎంతవరకు విజయాన్ని సాధిస్తారో చూడాలి.

R Tripura Malini

R Tripura Malini

Next Story