Akshay Kumar: అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

Akshay Kumar: తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Kranthi
Published on: 4 April 2021 10:28 AM IST
Akshay Kumar Tested Positive For Covid19
X

Akshay Kumar:(File Image)

Akshay Kumar: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో దాని ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంది. రికార్డుస్థాయిలో అక్కడ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.గత కొద్దిరోజులుగా వరసగా సినీ ప్రముఖులు వైరస్ బారిన పడుతున్నారు.

తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు‌. 'నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధలోకి వెళ్లాను. వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. తగిన జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తా' అని అక్షయ్‌ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ రామ్‌ సేత షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story