ఏఎన్నార్ బయోపిక్ పై నాగ్ కీలక నిర్ణయం

ఏఎన్నార్ బయోపిక్ పై నాగ్ కీలక నిర్ణయం
x
Highlights

ఒకప్పటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా ఎన్నో బయోపిక్ లకు మార్గదర్శకంగా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, చాలా మంది దర్శకులు బయోపిక్ ల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు.

ఒకప్పటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా ఎన్నో బయోపిక్ లకు మార్గదర్శకంగా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, చాలా మంది దర్శకులు బయోపిక్ ల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. అదే జోరుతో బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీశారు కానీ 'ఎన్టీఆర్ కథానాయకుడు' పెద్దగా ఆడలేదు. కారణం వెతుకగా సావిత్రి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి అవి సినిమాలో కూడా కనిపిస్తాయి కానీ ఎన్టీఆర్ జీవితం సాఫీగా సాగిపోతుంది.

అందువల్లే ఎలాంటి ట్విస్ట్ లు లేకపోవడం తో సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇక 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఫ్లాప్ అవ్వడం వల్ల నాగార్జున కూడా ఏఎన్నార్ బయోపిక్ ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ లాగానే అక్కినేని నాగేశ్వరరావు ది కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేని లేకుండా సాఫీగా సాగిపోయిన జీవితం. కాబట్టి అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. అందుకే ప్రస్తుతం అలాంటి ఆలోచనలు చేయకుండా ఉండటమే మంచిదని నాగ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఏఎన్నార్ జీవితం పై వెబ్ సిరీస్ తీస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నాగార్జున ఏం చేస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories