అడివి శేషుతో బాలీవుడ్ భామ!

Saiee Manjrekar In Major : విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో అడవి శేషు.. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలకి గాను

Krishna
Published on: 24 Sept 2020 2:41 PM IST
అడివి శేషుతో బాలీవుడ్ భామ!
X

Saiee Manjrekar 

Saiee Manjrekar In Major : విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో అడవి శేషు.. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలకి గాను అడవి శేషులి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం 'మేజర్' అనే మరో కొత్త తరహ కథతో ముందుకు వస్తున్నాడు అడవి శేషు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో అమరుడైన NSG కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతుంది ఈ చిత్రం. ఇందులో అడివి శేషు హీరోగా నటిస్తుండగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు..

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా 'దబాంగ్-3' బ్యూటీ సయీ మంజ్రేకర్‌ను సెలెక్ట్ చేశారు. ఆమె అక్టోబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొంటుందని అడివి శేష్ ఆఫీషియల్ గా ప్రకటించాడు. ఇక సయీ మంజ్రేకర్‌ ఎవరో కాదు.. బాలీవుడ్‌ నటుడు, ఫిల్మ్‌ మేకర్‌ మహేశ్‌ మంజ్రేకర్‌ కుమార్తె.. ప్రస్తుతం ఆమె వరుణ్ తేజ్ హీరోగా బాక్సర్‌ గా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తోనే ఆమె తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేస్తోంది.

ఇక మేజర్ చిత్రాన్ని ప్రిన్స్ మహేశ్ బాబు నిర్మిస్తున్నారు.. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ 50% పూర్తయింది. కరోనా వలన షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.


Krishna

Krishna

Next Story