Renu Desai Clarity on Mahesh Babu Movie: మహేష్ సినిమాపైన క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్!

Renu Desai Clarity on Mahesh Babu Movie: మహేష్ సినిమాపైన క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్!
x
Highlights

Renu Desai Clarity on Mahesh Babu Movie: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రీఎంట్రీ గురించి గత కొద్దిరోజులుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే..

Renu Desai Clarity on Mahesh Babu Movie: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రీఎంట్రీ గురించి గత కొద్దిరోజులుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అడవి శేషు హీరోగా 'మేజర్‌' అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే... సోనీ పిక్చర్‌ సంస్థతో కలిసి మహేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఓ ఆర్మీ మేజర్‌ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణదేశాయ్ ను తీసుకుంటున్నట్టుగా న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది..

అయితే రేణుదేశాయ్ ఈ సినిమా పైన క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను ఎలాంటీ పాత్ర చేయట్లేదని.. తాను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనంటూ పేర్కోంది రేణుదేశాయ్.. ఈ సినిమాలో తాను నటిస్తున్నానని చాలా మంది తనకి అభినందనలు తెలుపుతున్నారని అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని రేణుదేశాయ్ స్పష్టం చేసింది.. ఒకవేళ తాను సినిమాలకి ఒకే చెబితే తానే ముందుగా క్లారిటీ ఇస్తానని రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చారు..

ఇక రేణుదేశాయ్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి, జానీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది.. పవన్ తో విడాకుల అనంతరం డైరెక్షన్ పైన ఫోకస్ పెట్టింది. అగ్రికల్చర్ బేస్ గా ఓ సినిమా తీసేందుకు రేణుదేశాయ్ ప్లాన్ చేస్తున్నారు..

ఇక అటు మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది..

ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories