Renu Desai: మహేష్‌బాబు, అడవి శేషు సినిమాలో రేణుదేశాయ్‌

Renu Desai: మహేష్‌బాబు, అడవి శేషు సినిమాలో రేణుదేశాయ్‌
x
Highlights

Renu Sesai: ఒక పక్కా హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్కా వేరే హీరోలతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

Renu Sesai: ఒక పక్కా హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్కా వేరే హీరోలతో సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేషుతో 'మేజర్‌' అనే పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు మహేష్.. సోనీ పిక్చర్‌ సంస్థతో కలిసి మహేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఓ ఆర్మీ మేజర్‌ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణదేశాయ్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. ముందునుంచి ఆ పాత్ర కోసం మేకర్స్ రేణుదేశాయ్ ని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఆ పాత్ర కోసం రేణుేశాయ్ ని మీట్ అయ్యారని సమాచారం... ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న చిత్ర బృందం త్వరలో నటీనటులను ఎంపిక చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లనుంది.. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది..

ఇక రేణుదేశాయ్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి, జానీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది.. పవన్ తో విడాకుల అనంతరం డైరెక్షన్ పైన ఫోకస్ పెట్టింది. అగ్రికల్చర్ బేస్ గా ఓ సినిమా తీసేందుకు రేణుదేశాయ్ ప్లాన్ చేస్తున్నారు.. అలాగే సినిమాల్లో నటించేందుకు కూడా రేణుదేశాయ్ ఆసక్తి చూపిస్తున్నారు.. ఇక అటు మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, ఫ్రాడ్స్ వంటి విషయాల నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories