బాలీవుడ్‌ యువ న‌టి మిష్టీ ముఖ‌ర్జీ క‌న్నుమూత‌!

Misti Mukherjee Dies : బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఐటెం సాంగ్స్‌తో బాగా పాపులర్ అయిన మిష్టీ ముఖ‌ర్జీ(27) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Krishna
Published on: 4 Oct 2020 11:11 AM IST
బాలీవుడ్‌ యువ న‌టి మిష్టీ ముఖ‌ర్జీ క‌న్నుమూత‌!
X

 Misti Mukherjee

Misti Mukherjee Dies : బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఐటెం సాంగ్స్‌తో బాగా పాపులర్ అయిన మిష్టీ ముఖ‌ర్జీ(27) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతిపట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమ సంతాపం తెలుపుతుంది. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి 2012లో వ‌చ్చిన "లైఫ్ కి తో ల‌గ్ గ‌యి" అనే సినిమాతో ఆమె సినీ కెరియ‌ర్ మొదలైంది.


రజనీష్ దుగ్గల్ తో కలిసి గోవింద ఆలే రే అనే డ్యాన్స్ నెంబర్ చేసింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరియు కత్రినా కైఫ్ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వగా, జూహి చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. మ్యూజిక్ వీడియోలతో ఆమె మరింతగా పాపులర్ అయ్యారు! ఇక ముంబైలోని ఆమె అద్దె అపార్ట్‌మెంట్‌లో సెక్స్ రాకెట్ నడిపారనే ఆరోపణలు రావడంతో 2014 లో నటి సోదరుడు, తండ్రిని అరెస్టు చేశారు. మిష్టీ ముఖర్జీ హిందీతోపాటు బెంగాలీ సినిమాలలో కూడా నటించారు. 27 ఏళ్ల వయసున్న మిస్తీ బెంగళూరులో స్థిరపడ్డారు.



Krishna

Krishna

Next Story