సుశాంత్‌ది ఆత్మహత్యే.. స్పష్టం చేసిన ఎయిమ్స్

సుశాంత్‌ది ఆత్మహత్యే.. స్పష్టం చేసిన ఎయిమ్స్
x

Sushant Singh Rajput

Highlights

Sushant Singh Rajput Death : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చనిపోయి నాలుగు నెలలకి పైగా అవుతుంది. ఈ కేసును సీబీఐ విచారణ చేప్పట్టి దాదాపుగా ఒకటిన్నర నెలలు అవుతుంది.

Sushant Singh Rajput Death : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చనిపోయి నాలుగు నెలలకి పైగా అవుతుంది. ఈ కేసును సీబీఐ విచారణ చేప్పట్టి దాదాపుగా ఒకటిన్నర నెలలు అవుతుంది. అయినప్పటికీ సీబీఐ తమ దర్యాప్తులో ఇంకా ఏమీ తేల్చలేదని పలువురు మండిపడుతున్నారు. అయితే తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యే అని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం ప్రకటించింది. సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టును విశ్లేషించి సీబీఐకి ఈ విషయాన్ని వెల్లడించింది.

అతడికి విషం ఇచ్చి, గొంతు నులిమి చంపడం వంటివి జరగలేదని స్పష్టం చేసింది. ఇక అంతకుముందు సుశాంత్‌ మృతదేహంలో ఎలాంటి విష ప‌దార్ధాలు లేవని , ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్‌ వర్గాలు ధృవీకరించిన సంగతి తెలిసిందే.. దీంతో ఆత్మహత్య కోణంలో సీబీఐఈ కేసును దర్యాప్తు చేయనుంది. సుశాంత్ ఆత్మహత్యకు ఆయనను ఎవరైనా ప్రేరేపించారా లేదా అన్న కోణంలో సీబీఐ ఇన్వెస్టిగేట్ చేయనుంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదని హత్య అని పలువురు కామెంట్స్ చేయడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరియు సంబంధిత మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పరిశీలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories