Manchu lakshmi Tweet On Sushant Issue : కోవిడ్ 19 కంటే సుశాంత్ ఇష్యూ పైనే ఎక్కువగా వర్రీ అవుతున్నారు!

Manchu lakshmi Tweet On Sushant Issue : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పెద్ద సంచలనాన్ని సృష్టించింది.. మంచి

Krishna
Published on: 9 Sept 2020 4:31 PM IST
Manchu lakshmi Tweet On Sushant Issue :  కోవిడ్ 19 కంటే సుశాంత్ ఇష్యూ పైనే ఎక్కువగా వర్రీ అవుతున్నారు!
X

Manchu lakshmi 

Manchu lakshmi Tweet On Sushant Issue : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పెద్ద సంచలనాన్ని సృష్టించింది.. మంచి స్టార్ గా ఉన్న సమయంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలవరపరిచింది.. ప్రస్తుతం సుశాంత్ కేసుపై సీబీఐతో పాటుగా మరికొన్ని కేంద్ర సంస్థలు విచారణని చేపడుతున్నాయు.. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలగా ఉన్న రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్న (మంగళవారం) అరెస్ట్ చేసింది.. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా వెల్లడించింది..

అయితే నిజానిజాలు బయటపడకముందే రియాను మీడియా ఇబ్బందులకు గురి చేయడం బాగులేదంటూ నటి మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. ఆమెతో పాటుగా పలువురు రియాకి మద్దతు పలుకుతున్నారు.. ఎన్సీబీ విచారణకు హాజరైన సమయంలో రియా పైన మీడియా వ్యవహరించిన తీరు పట్ల మంచు లక్ష్మి అసహనాన్ని వ్యక్తం చేశారు.. వీడియోలతో, మైకులతో ఆమె మీద పడిపోవడం వంటి దృశ్యాలు కలిచివేశాయని ఆమె అన్నారు.. ఇక తాజాగా భారతీయులు దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు అనే విషయంపై ట్వీట్ చేసింది మంచు లక్ష్మి.. ఇందులో కోవిడ్ 19 కంటే కూడా సుశాంత్ సింగ్ కేసు ఇష్యూ పైనే ఎక్కువగా వర్రీ అవుతున్నారని ఇదే నిజం అని ఒక పై చార్ట్ ని పోస్ట్ చేసింది మంచు లక్ష్మీ..


Krishna

Krishna

Next Story