Actor Vijay: బాలీవుడ్ స్టార్ హీరో కోసం స్పెషల్ పాత్రలో కనిపించబోతున్న విజయ్

* షారుఖ్ ఖాన్ సినిమాలో స్పెషల్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో.

admin1
Updated on: 9 Oct 2021 11:49 AM IST
Actor Vijay Playing Special Role in Shah Rukh Khan Pathan Movie
X

షారుఖ్ ఖాన్ - విజయ్ 

Actor Vijay: కోలీవుడ్ లో స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు ఒక బాలీవుడ్ సినిమాలో ఓ పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న షారుఖ్ ఖాన్ "పటాన్" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు షారుక్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో "తెరి", "మెర్సల్", "బిగిల్" వంటి సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించిన విజయ్ ఇప్పుడు మరియు షారుఖ్ ఖాన్ సినిమాలో ఒక స్పెషల్ పాత్ర పోషించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

తన కెరియర్లో మూడు మర్చిపోలేని సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు అట్లీ కోసం విజయ్ మరొక స్టార్ హీరో అయిన షారుఖ్ ఖాన్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అట్లీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విజయ్ ఓ స్పెషల్ పాత్ర పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలను రెట్టింపు అయ్యాయి అనచ్చు. ఈ సినిమాలో విజయ్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

admin1

admin1

Next Story