Prakash Raj Satire On Kangana : కంగనా పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు!

Prakash Raj Satire On Kangana : బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం పై,

Krishna
Published on: 12 Sept 2020 1:58 PM IST
Prakash Raj Satire On Kangana : కంగనా పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు!
X

Kangana, Prakash Raj 

Prakash Raj Satire On Kangana : కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం పై, ముంబై పోలిసుల పై కీలక వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా ఆమెపై నటుడు ప్రకాశ్‌రాజ్ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. ఒక్క సినిమాతో కంగనా.. తనను తాను రాణి లక్ష్మీ బాయి అని అనుకుంటే.. అప్పుడు దీపికా పడుకొనే -పద్మావతి, హృతిక్ రోషన్- అక్బర్, షారుఖ్‌ ఖాన్-అశోక, అజయ్ దేవ్‌గన్- భగత్ సింగ్, అమీర్ ఖాన్-మంగల్ పాండే, వివేక్ ఒబేరాయ్- మోదీ.. వీళ్లు కూడా అలానే ఆలోచించాలా అని #justasking పేరుతో ఓ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.. దీనికి సంబంధించిన ఫోటోను అయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల సెన్సేషనల్ కామెంట్స్ చేసింది కంగనా.. ఇప్పుడు అక్కడ కంగనా vs మహారాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా సాగుతుంది.. తాజాగా ముంబైలోని ఆమె కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై హైకోర్టు కంగనా ఆఫీసును కూల్చొదంటూ స్టే విధించింది. ఈ క్రమంలో ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి పలు కామెంట్స్ చేశారు.. మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ కామెంట్స్ చేసింది.. అమెకి హీరో విశాల్ తో పాటు మరికొందరు మద్దతు పలుకుతున్నారు..

Krishna

Krishna

Next Story