Kangana Ranaut Targets Sonia Gandhi : సోనియాను టార్గెట్ చేసిన కంగనా.. మీరు ఓ మహిళే కదా అంటూ..

Kangana Ranaut Targets Sonia Gandhi : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ తీరును, ముంబై పోలీసుల

Krishna
Published on: 11 Sept 2020 3:11 PM IST
Kangana Ranaut Targets Sonia Gandhi : సోనియాను టార్గెట్ చేసిన కంగనా.. మీరు ఓ మహిళే కదా అంటూ..
X

Kangana Ranaut, Sonia Gandhi 

Kangana Ranaut Targets Sonia Gandhi : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ తీరును, ముంబై పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ పలు కీలక వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఇప్పుడు అక్కడ కంగనా vs మహారాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా సాగుతుంది.. తాజాగా ముంబైలోని ఆమె కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై హైకోర్టు కంగనా ఆఫీసును కూల్చొదంటూ స్టే విధించింది. ఈ క్రమంలో ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి పలు కామెంట్స్ చేశారు.. మీ అహంకారం తొలిగిపోయే రోజు వస్తుంది అంటూ కామెంట్స్ చేసింది.. అమెకి హీరో విశాల్ తో పాటు మరికొందరు మద్దతు పలుకుతున్నారు..

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్ చేశారు.. ఆమెకి వరుసగా ఘాటు ట్వీట్లు చేసింది కంగనా.. " మీ ప్రభుత్వం సాటి మహిళను పెడుతున్న ఇబ్బందులను చూసి మీ మనసు చలించడం లేదా? అని ప్రశ్నిచింది. ఎక్కడో విదేశాల్లో పెరిగిన మీరు ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్నారు. మీ మౌనం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. మీ సొంత ప్రభుత్వమే ఓ మహిళను తీవ్రంగా వేధిస్తోంది .. అంబేడ్కర్‌ మనకిచ్చిన ఆదర్శాలను పాటించాల్సిందిగా మీ ప్రభుత్వాన్ని అభ్యర్థించలేరా? ఇప్పటికైన మీరు జోక్యం చేసుకుంటారని నేను ఆశిస్తున్నానని కంగనా ట్వీట్ చేసింది.



Krishna

Krishna

Next Story