నాకేం కాలేదు బాబోయ్! పేరు తెచ్చిన తిప్పలతో యువ హీరో గగ్గోలు!

నాకేం కాలేదు బాబోయ్! పేరు తెచ్చిన తిప్పలతో యువ హీరో గగ్గోలు!
x
Highlights

కుడి ఎడమైతే పొరపాటు కాదోయ్ అన్నాడు ఓ సినీకవి. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని ఆ చిన్న పొరపాటుతో చాల మంది తిప్పలు పడుతున్నారు. నటుడు తరుణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ.

సోషల్ మీడియా విపరీతంగా పరుగులు తీస్తోంది. ఎక్కడ ఏం జరిగినా సెకన్ల వ్యవధిలో ప్రపంచమంతా పాకిపోతోంది. చాలాసార్లు ఇది గందరగోళాన్ని సృష్టిస్తోంది కూడా. వార్తలో నిజానిజాలు తెలుసుకోకుండా ఒకరి నుంచి ఒకరికి కన్ను మూసి తెరిచే లోపు పాకిపోతుండడం చాల మందికి ఇబ్బందులు కలిగిస్తోంది. చిన్న పేరు పొరపాటు ఒక యువహీరోకి నిద్దుర లేకుండా చేసిన సంఘటన ఇది.

సోమవారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రమాదం జరిగింది. అల్కాపూర్ వద్ద ఓ కారు వేగంగా వచ్చి డివైడర్ ను dhee కొట్టింది. వెంటనే కారులో ఉన్న వ్యక్తి మరో కారులో వెళ్ళిపోయాడు. అయితే, ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు కారులో వెళుతున్న వ్యక్తిని టాలీవుడ్ యువ నటుడిగా గుర్తించారు. కానీ పేరును పొరబడ్డారు. నిజానికి కారు లో ఉన్నది రాజ్ తరుణ్. అయితే, పేరును పొరపాటుగా తరుణ్ అని చెప్పారు. దీంతో ఇదే పేరుతొ వార్త వైరల్ అయింది. ప్రమాదం జరిగిందనీ, తరుణ్ కు గాయాలు తగిలాయనీ, వెంటనే వెళ్లిపోయారనీ ఇలా సోషల్ మీదియాలోనే కాకుండా కొన్ని చానెల్స్ లో కూడా కారు విజువల్స్ తో సహా వార్తలు ప్రసారమయ్యాయి. దీంతో తరుణ్ ఇంటికి పరామర్శలు మొదలయ్యాయి. ఫోన్లో అయన క్షేమసమాచారం గురించి ఆరాతీయడం ఎక్కువైపోయింది. ఇబ్బందికి గురైన తరుణ్ మీడియా సమావేశం పెట్టి..తాను ఇంట్లోనే ఉన్నాననీ, ఏక్సిడెంట్ జరిగింది తన కారుకు కాదనీ వివరణ ఇచ్చుకున్నారు.

ఇంతకీ ఎవరిదీ?

పోలీసులు ఆరా తీయగా తేలింది ఏమిటంటే.. యాక్సిడెంట్ కు గురైన కారు యువ నటుడు రాజ్ తరుణ్ దని తేలింది. ఆయన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తున్న సమయంలో అల్కాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. దాంతో అయన వేరే కారులో వెళ్ళిపోయారు. అయితే, ఆయన ఎక్కడ ఉన్నదీ తెలియరాలేదు. పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ తరుణ్ ఎక్కడున్నారనే విషయాన్ని వాకబు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories