Aadhi Pinisetty clarifies about 'Pushpa': అవి కేవలం పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన ఆది పినిశెట్టి!

Aadhi Pinisetty clarifies about Pushpa: అవి కేవలం పుకార్లే.. క్లారిటీ ఇచ్చిన ఆది పినిశెట్టి!
x
aadhi pinisetty not part of pushpa movie
Highlights

Aadhi Pinisetty clarifies about ‘Pushpa’: ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్టు కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

Aadhi Pinisetty clarifies about 'Pushpa': ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్టు కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.. ఆ పాత్ర అల్లు అర్జున్ కి అన్నయ్య అంటూ వార్తలు వచ్చాయి.. ఈ క్రమంలో ఆది పినిశెట్టి దీనిపైన క్లారిటీ ఇచ్చాడు.. తాను ఈ చిత్రంలో నటించడం లేదని, తనపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని, సినిమా నుంచి ఎవరు తనను సంప్రదించలేదని ఆది పినిశెట్టి పేర్కొన్నాడు.. ఆది పినిశెట్టి గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు అన్నయ్య పాత్రలో నటించి మెప్పించాడు. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మళ్లీ మొదలు కానుంది..

అటు ఆది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. కీర్తిసురేశ్ తో గుడ్ లక్ సఖి చిత్రంతోపాటు ఆకాంక్ష సింగ్ తో కలిసి స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న సినిమా చేస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories