Tollywood Director Krish As Producer: సురేందర్ రెడ్డి దర్శకుడు.. క్రిష్ నిర్మాత..!

Tollywood Director Krish As Producer: చేసినవని తక్కువే సినిమాలే అయినప్పటికీ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్..

Krishna
Published on: 7 July 2020 10:00 PM IST
Tollywood Director Krish As Producer: సురేందర్ రెడ్డి దర్శకుడు.. క్రిష్ నిర్మాత..!
X
Surender Reddy, Krish (File Photo)

Tollywood Director Krish As Producer: చేసినవని తక్కువే సినిమాలే అయినప్పటికీ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్.. అయితే ఇప్పుడు క్రిష్ నిర్మాతగా మారుతున్నాడు. పీచర్ ఫిల్మ్స్ తోపాటు వెబ్ సిరీస్ లను నిర్మించే యోచనలో ఉన్నాడు. అయితే ఇప్పుడు క్రిష్ కి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. గత ఏడాది సైరా లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమాకి క్రిష్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు అయిపోగా, ఇందులో ఓ స్టార్ హీరో నటించనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఆఫీషియల్ అనౌన్స్ రానుంది. ఇక ఈ సినిమాతో పాటుగా కృష్ణ అండ్ హిస్ లీలా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు తీస్తున్న కొత్త చిత్రానికి కూడా క్రిష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు...

ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27 వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాని ఎఎం రత్నం తెరకెక్కిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ మొదలవ్వగా కరోనా వలన వాయిదా పడింది. ఇందులో పవన్ తమన్నా హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఇక అటు పవన్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది.


Krishna

Krishna

Next Story