జులైలో సెట్స్ పైకి పవన్, క్రిష్ మూవీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే..

Krishna
Updated on: 24 May 2020 2:05 PM IST
జులైలో సెట్స్ పైకి పవన్, క్రిష్ మూవీ!
X
Pawan Kalyan, Krish (File Photo)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే అయన వరుసపెట్టి సినిమాలకు సైన్ చేశారు. ప్రస్తుతం పవన్ రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం .. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్,అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఈ సినిమా తరవాత వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ మరో సినిమాని చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం జూలై సెకండ్ వీక్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుపుకోనున్నట్లుగా తెలుస్తుంది. విదేశాల్లో షూటింగ్ కి అనుమతి లేకపోవడంతో మ్యాగ్జిమమ్ షూటింగ్‌ను క్రిష్ సెట్స్‌లోనే చిత్రీకరించాలని ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక షూటింగ్ మొదలయ్యాక క్రిష్ సినిమాని ఎంత ఫాస్ట్ గా తీస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ .. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు పవన్ సిద్దంయ్యరని తెలుస్తోంది.


Krishna

Krishna

Next Story