ఆసుపత్రిలో సీనియర్ నటి.. చనిపోతే బావుండును అంటూ face bookలో పోస్ట్ చేసిన టీచర్!

ఆసుపత్రిలో సీనియర్ నటి.. చనిపోతే బావుండును అంటూ face bookలో పోస్ట్ చేసిన టీచర్!
x
Highlights

ఎంతటి శత్రువైనా ఆపదలో ఉన్నాడంటే అయ్యో అనుకుంటాం. సాటి మనిషిగా అవతలి వ్యక్తి ఎటువంటి వాడైనా కష్టంలో ఉన్నపుడు కొంతైనా బాధ పడతాం. కానీ, ఓ టీచర్ మాత్రం...

ఎంతటి శత్రువైనా ఆపదలో ఉన్నాడంటే అయ్యో అనుకుంటాం. సాటి మనిషిగా అవతలి వ్యక్తి ఎటువంటి వాడైనా కష్టంలో ఉన్నపుడు కొంతైనా బాధ పడతాం. కానీ, ఓ టీచర్ మాత్రం ప్రముఖ సీనియర్ సినీ నటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉంటే.. ఆమె చనిపోతే బావుండునని కోరుకుంటున్నట్టు ఫస్ బుక్ లో పోస్ట్ పెట్టింది.దాంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి..

ప్రమాదానికి గురైన షబానా ఆజ్మీ..

ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పూణే-ముంబై హైవే లో ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళుతున్న ట్రక్ ను బలంగా ఢీకొంది. దీంతో షబానా కు , డ్రైవర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వారిని నవీ ముంబైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ కూడా షబానా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ కూడా చేశారు. దేశవ్యాప్తంగా షబానా ఆరోగ్యపరిస్థితి పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటులు చాలా మంది ఆమెను ఆసుపత్రిలో పరామర్శించి వచ్చారు.

అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ షబానాపై ఫేస్‌బుక్‌లో 'షబానా చస్తే బాగుండు' అనే అర్థం వచ్చేలా అభ్యంతకర పోస్ట్ పెట్టారు. షబానాకు ఆ టీచర్‌కు మధ్య ఏం జరిగిందనేది తెలీకపోయినా, ఆమె చేసిన పని తీవ్రమైన తప్పిదం కావడంతో విషయం తెలుసుకున్న అధికారులు ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేసేశారు. ఎందుకు షబానా చావు కోరుకోవాలని అనుకుంటోందో తెలుసుకునేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

నిలకడగా షబానా ఆరోగ్యం..

ప్రస్తుతం షబానా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆమె వేగంగా కోలుకుంటున్నారు. ఆమె ఐసీయూలోనే ఉన్నారు కానీ ఆరోగ్యం బాగానే ఉందని షబానా భర్త జావేద్ అక్తర్ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories