మన్మధుడు ట్విట్టర్ రివ్యూ.. కామెడీతో మతి పోగొట్టాడట!

అక్కినేని నాగార్జున, రాకుల్ జంటగా నటించిన తాజా చిత్రం మన్మధుడు. యూఎస్ లో మొదటి షో కి మంచి స్పందన వచ్చింది. ట్విట్టర్ ద్వారా పలువురు సినిమాని ప్రశంసిస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.
నాగార్జున.. రకుల్ ప్రీత్ జంటగా నటించిన చిత్రం మన్మధుడు. ఈసినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్‌ఏలో 250 పైగా లొకేషన్లలో సినిమా మొదటి షో పూర్తియింది. అక్కడ సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ట్వీట్ల పరంపర చూస్తే.. దాదాపుగా అందరూ మన్మధుడు కామెడీతో చంపేశాడు అంటున్నారు. అంతే కాదు.. నాగార్జున యంగ్ లుక్స్ తో ఫిదా చేసేశాడు అని విపరీతంగా పొగిడేస్తున్నారు.
ఇక ట్విట్టర్ లో వచ్చిన రివ్యూల ప్రకారం సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ తో.. ఫుల్ రొమాంటిక్ టచ్ తో సాగిందని చెబుతున్నారు. సినిమాలో డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయని అందరూ పేర్కొంటున్నారు. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. నాగార్జున, రకుల్ తో పాటు వెన్నెల కిషోర్ సందడి చాలా బావుందట. సినిమా మొత్తం ఎక్కడా విసుగు తెప్పించకుండా..విరామం లేకుండా నవ్విన్చారని యూఎస్ ప్రేక్షకుల రెస్పాన్స్. మరి కొద్ది సేపట్లో మన దగ్గర కూడా మన్మధుడు కామెడీ రొమాన్స్ మొదలవుతుంది. తరువాత ఎలా ఉందొ.. ఏమిటో మళ్ళీ వివరంగా చెప్పుకుందాం..
నటుడిగా మంచి పేరు సంపాదించుకుని, దర్శకత్వం వైపు అడుగులేసి.. చి.సౌ.ల. సినిమాతో మార్కులు కొట్టేసిన రాహుల్ రవీంద్ర ఈ మన్మదుడ్ని మన ముందుకు తెచ్చారు. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత అక్కినేని, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో మెరవగా.. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి ఎడిటర్లుగా పనిచేశారు. కిట్టు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రన్‌లు పేలిపోయే పంచ్ డైలాగులు రాశారు. 'RX 100' ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించారు.
మన్మధుడు..మరిన్ని సినిమా రివ్యూలు
#Manmadadhu2 good first half..
— Gautam (@gauthamvarma04) August 8, 2019
Nagarjuna is, really looking young & handsome... In fact @Rakulpreet looks older compared to King Nagarjuna.... #Manmadhudu2
— Sachin Babu (@SachinB58290576) August 8, 2019
Nagarjuna is, really looking young & handsome... In fact @Rakulpreet looks older compared to King Nagarjuna.... #Manmadhudu2
— Sachin Babu (@SachinB58290576) August 8, 2019
- నాగార్జున Tollywood News in Telugu Telugu movie news Manmadhudu 2 Manmadhudu 2 review Manmadhudu 2 twitter review King Nagarjuna Rakul Preet Singh Romance Comedy Manmadhudu 2 review in Telugu US audience Blockbuster Viacom 18 Studios Cinematography Keerthi Suresh Samantha Akkineni Manam enterprises Young Nagarjuna
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT