Top
logo

ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు (మే-21-గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం...

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

నిన్నటి ముఖ్యాంశాలు కొన్ని..

- ఒడిశా తీరంలో ఉంఫాన్ తుఫాను బీభత్సం.. పసికందు సహా ఇద్దరు మృతి - పూర్తి వివరాలు

- పర్యావరణ రక్షణ కోసం ఏపీలో కొత్త చట్టానికి రూపకల్పన - పూర్తి వివరాలు

- మూటలు మోసింది ఆయనే.. రేవంత్ రెడ్డి విమర్శలు -పూర్తి వివరాలు

ఈరోజు తాజా వార్తలు

Web Titlebreaking-news-live-updates-may-21-latest-telangana-and-andhra-pradesh-news

Live Updates

 • 21 May 2020 6:42 AM GMT

  నూజివీడు ఆర్టీసీ డిపో నుండి ప్రారంభమైన బస్ సర్వీసులు

  * కృష్ణాజిల్లా నూజివీడు ఆర్టిసి డిపో నుండి విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం,  మైలవరం రూట్లలో 16 బస్ సర్వీసులు

  * నూజివీడు నుండి విజయవాడ-6, మచిలీపట్నం కు 2, గుడివాడకు 4, మైలవరం 3కు, ముసునూరు1 మొదలయ్యాయి.

  * మాస్కులు ధరించి, శానీటైజర్లు తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే ప్రయాణికులను బస్సు ఎక్కిస్తున్న డ్రైవర్లు.

 • 21 May 2020 6:41 AM GMT

  నెల్లూరు మునిసిపల్ కమిషనర్ గా IAS అధికారి స్వప్నిల్ దినకర్ బదిలీ రద్దయింది.

 • 21 May 2020 6:22 AM GMT

  -కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో ధాన్యం లారీ బోల్తా

  -నిజాంసాగర్ నుంచి కామారెడ్డి కి ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ

  -ప్రమాద వశాత్తు బోల్తా పడడంతో ఇద్దరికి గాయాలు

 • 21 May 2020 6:22 AM GMT

  -ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలు.

  -సోమాజి గూడ లోని రాజీవ్ గాంది విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్.

  -పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి వి.హనుమంత రావు, గూడూరు నారాయణ రెడ్డి ,బొల్లు కిషన్ తదితరులు....

  -పోలిసు బందోబస్తు మద్య నివాళులర్పించిన నేతలు

 • 21 May 2020 5:44 AM GMT

  ఏపీలో విద్యుత్ బిల్లుల అంశంపై హైకోర్టులో విచారణ

  3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.

  2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్న పిటిషనర్ తరపు లాయర్

  ఏబీసీ టారిఫ్ యూనిట్లలో మార్పులు చేశారన్న పిటిషనర్ తరపు లాయర్

  కొత్త నిబంధనలు ఏప్రిల్1 నుంచి రావాలన్న పిటిషనర్ తరపు లాయర్..

  2 నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం స్లాబు మారి బిల్లులు పెరిగాయని వాదనలు

 • 21 May 2020 3:35 AM GMT

  - నల్గొండ జిల్లాలో చిట్యాల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

  - ఆగి వున్న లారీ.. డీ కొన్న కారు.

  - ముగ్గురు మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.

  - తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాదు వస్తుండగా జరిగిన ప్రమాదం.

 • 21 May 2020 3:35 AM GMT

  సింగరేణిలో పనులు షురూ..

  సింగరేణిలో విధించిన కోవిడ్ 19 లే ఆఫ్ ను ఎత్తి వేయడంతో భూపాలపల్లి ఏరియాలో 50 రోజుల అనంతరం పునఃప్రారంభమైన 4 భూగర్భ గనులు, అధికారులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ విధులకు హాజరవుతున్న కార్మికులు

 • 21 May 2020 1:35 AM GMT

  కేంద్ర పన్నులలో మే నెల రాష్ట్రాల వాటాను ప్రకటించిన కేంద్రం

  – రాష్ట్రాల మే నెల విడత నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం

  – మొత్తం రూ.46,038.70 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

  – ఆంధ్రప్రదేశ్‌కు రూ.1892.64 కోట్లు నిధులు కేటాయింపు

  – తెలంగాణ రాష్ట్రానికి రూ.982 కోట్ల నిధుల కేటాయింపు

 • 21 May 2020 1:31 AM GMT

  - విశాఖ మన్యంలో ప్రమాదవశాత్తూ బాలిక మృతి 

  - విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలం గొందిమెలక గ్రామానికి చెందిన వంతాల చిన్నారి (12) 

  - బట్టలు ఉతికేందుకు గెడ్డకు వెళ్ళిన చిన్నారి.

  - ప్రమాదవశాత్తు కాలుజారీ గెడ్డల్లో పడి మృతి.


 • 21 May 2020 1:28 AM GMT

  ఏపీలో ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులు

  - ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

  - రెండు నెలలుగా దిపోలకే పరిమితమైన బస్సులు 

  - మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు ఈరోజు నుంచి తిరగనున్నాయి.

  - 17 శాతం బస్సులు తిప్పేందుకు సన్నాహాలు చేసిన అధికారులు 

  - ఆరోగ్య సేతు యాప్ ఉన్నవారిని మాత్రమె ప్రయాణానికి అనుమతిస్తున్నారు. Next Story