Top
logo

మూటలు మోసింది ఆయనే.. రేవంత్ రెడ్డి విమర్శలు

మూటలు మోసింది ఆయనే.. రేవంత్ రెడ్డి విమర్శలు
X
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. చంద్రబాబు చెప్పులు మోసింది...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే అంటూ విమర్శలు సంధించారు. వైఎస్ కు మూటలు మోసింది కూడా కేసీఆరే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్నదే కేసీఆర్ అని గుర్తుచేశారు.

మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్యేలను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్ దే అన్నారు. సీఎం అయ్యాక తెలంగాణకి ఏం చేసావో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ టైం పాస్ గా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకున్నారన్నారూ. కేసీఆర్ మాట్లాడే సమయం ఎన్నికలే అని రేవంత్ ఎద్దేవా చేశారు.

Web TitleCongress leader Revant Reddy criticized the CM KCR press meet in Telangana
Next Story