Live Updates:ఈరోజు (జూన్-07) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు ఆదివారం, 07 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, విదియ (రాత్రి 10:55 వరకు), తదుపరి తదియ, మూలా నక్షత్రం (మధ్యాహ్నం 02.10 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:48 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Jun 2020 1:15 PM IST
నిమ్స్‌లో ఓపీ బంద్!
తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ కబలిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు మిన్నంటుతున్నాయి. దీంతో కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇక మరో వైపు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఓపీ, రోగుల అడ్మిషన్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.

- 7 Jun 2020 1:08 PM IST
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గన్ మిస్ ఫైర్.. తృటిలో తప్పిన ప్రమాదం...
నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది. కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ తుపాకీని శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

- 7 Jun 2020 11:56 AM IST
హుస్సేనీఆలం ఎస్‌బీఐ బ్యాంకు మూసివేత
కరోనా మహమ్మారి కారణంగా మూసాబౌలీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుస్సేనీఆలంలోని తన బ్రాంచ్‌ను మూసివేసింది. బ్యాంక్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో పంజేషా యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రానా తబస్సుం బ్యాంకు సిబ్బందిని అందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.

- 7 Jun 2020 7:24 AM IST
కరోనా కేసుల్లో ఐదో స్థానంలో ఇండియా
ఇండియాలో కరోనా మహమ్మారి దూసుకుపోతోంది.
- శనివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్త 9,887 కేసులు నమోదు అయ్యాయి.
- కరోనాకు కేంద్రంగా పేరు తెచ్చుకున్న స్పెయిన్ ను ఇండియా అధిగమించింది. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఉన్నాయి.
- స్పెయిన్ లో 2,40,978 కేసులుండగా, ఇండియాలో కేసుల సంఖ్య 2.44 లక్షలను దాటింది..
- ఇదే సమయంలో రికవరీ రేటు 48.27 శాతం నుంచి 48.20 శాతానికి తగ్గింది.
- గడచిన 24 గంటల్లో 294 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 6,642కు చేరింది.



