నిమ్స్‌లో ఓపీ బంద్‌!

నిమ్స్‌లో ఓపీ బంద్‌!
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ కబలిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు మిన్నంటుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా వైరస్ కబలిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు మిన్నంటుతున్నాయి.దీంతో కోవిడ్ నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి పూర్తి స్థాయిలో నిండిపోయింది. మొన్నటి వరకు రోజుకు సుమారు 150 వరకూ కొత్త కేసులలోపు నమోదవుతుండగా శనివారం అందుకు రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఇంకా రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉండడంతో వైద్యులకు తలకుమించిన భారంగా మారింది. నిజానికి గాంధీ ఆస్పత్రి సుమారుగా 1,160 పడకలుండగా కరోనా బాధితుల తాకిడి ఎక్కువగా ఉండడంతో గాంధీ వైద్య కళాశాలలో కూడా మరో 350 పడకలను అదనంగా సర్దారు. ఈ పడకలతో కలుపుకుంటే ప్రస్తుతం 1,510 పడకలు ఏర్పాటయ్యాయి.

ఇక మరో వైపు నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఓపీ, రోగుల అడ్మిషన్‌ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. అధికారికంగా 5 విభాగాల్లోనే ఈ సేవలను ఆపినట్లు ప్రకటించినా పూర్తిస్థాయిలో ఓపీ బంద్‌ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఆస్పత్రిలో బయటి నుంచి రోగులు వచ్చినా చేర్చుకోకుండా ఇన్‌ పేషెంట్‌ సేవలను కూడా చాలా వరకు తగ్గించారు. ఉద్యోగుల హాజరుపై కూడా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆస్పత్రిని తెరచినప్పటికీ ఓల్డ్‌ బిల్డింగ్‌లోని ఏ, బీ, సీ బ్లాక్‌లైతే ఇంకా తెరుచుకోనేలేదు. కేవలం అత్యవసర విభాగాలను మాత్రమే తెరచి ఉంచారు. కాగా అందులో కార్డియాలజీ విభాగంలో ఓ రోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రోగి నుంచి కరోనా ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తి చెందడంతో ఆస్పత్రిలో నియంత్రణ చర్యలు ప్రారంభించారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలను చేపట్టేందుకు సంసిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఔట్ పేషెంట్ల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. రోగులను డిశ్చార్జి చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులను ఎక్కడికి తరలించాలన్న దానిపై ఆస్పత్రి యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం కార్డియాలజీ ఐసీయూ సహా ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో దాదాపు 100 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఇక పోతే ఆదివారం నుంచి స్పెషాలిటీ బ్లాక్‌ను పూర్తిగా మూసేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఇక ముఖ్యంగా కరోనా వైరస్ ఈ బ్లాక్‌ నుంచే వ్యాప్తి చెందింది దీంతో హైపో క్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్‌ చేయడం వంటి ప్రక్రియ చేపడుతున్నట్లుగా సూపరింటెండెంట్‌ సత్యనారాయణ తెలిపారు. అంతే కాకుండా ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందిలో 30% మంది విధిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. మిగిలిన వైద్యులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులు, కార్మి కులు సైతం 70 శాతం మేరకు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories