Live Updates:ఈరోజు (జూలై-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు సోమవారం, 20 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం అమావాస్య (రా. 10-44 వరకు) తర్వాత శుక్లపక్ష పాడ్యమి, పునర్వసు నక్షత్రం (రా. 9-53 వరకు) తర్వాత పుష్యమి నక్షత్రం.. అమృత ఘడియలు ( రా. 7-27 నుంచి 9-04 వరకు), వర్జ్యం ( ఉ. 9-45 నుంచి 11-22 వరకు తిరిగి తె. 5-48 నుంచి) దుర్ముహూర్తం (మ.12-31 నుంచి 1-23 వరకు తిరిగి మ. 3-07 నుంచి 3-58 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-34
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 20 July 2020 10:35 AM IST
బీసీ కార్పొరేషన్‌పై ఏపీ సీఎం జగన్ సమావేశం
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నేడు సీఎం జగన్ సమావేశం కానున్నారు.
- ఉదయం 11 గంటలకు బీసీ కార్పొరేషన్‌పై అధికారులతో సమావేశమై చర్చించనున్నారు.
- మధ్యాహ్నం అముల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొనే అంశం పై చెర్చించనున్నారు.
- 20 July 2020 10:12 AM IST
హరితహారం పథకానికి తూట్లు పొడుస్తున్న అధికారులు
- సర్కార్ మానస పుత్రిక పథకం. అలంటి పథకానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు.
- నాటిన హరితాహారం చెట్లు, మొక్కలతో కలకలలాడాల్సిన ప్రాంతం మొత్తం బీడు భూములను తలపిస్తున్నాయి.
- ఆదిలాబాద్ లో 2019 - 20 సంవత్సరానికి గాను లక్షల మొక్కలు నాటారు.
- ఒక్క బోద్ మండలంలోనే 10, 749 మొక్కలు నాటారు.
- 20 July 2020 10:05 AM IST
టీడీపీ అదినేత చంద్రబాబు పై మంత్రి బొత్స ఆగ్రహం
- టీడీపీ అదినేత చంద్రబాబు పై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు.
- చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాయటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు బొత్స.
- లేఖలో చంద్రబాబు ఒక్క నిజం కుడా చెప్పలేదని విమర్శించారు.
- 8 కిలోమీటర్ల అభివృధి కోసం లక్షల కోట్లు కర్చు పెట్టారని విమర్శించారు.
- 20 July 2020 9:59 AM IST
కరోనాతో తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు మృతి
- శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస మూర్తి దీక్షితులు మృతి.
- కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ దీక్షితులు.
- ఆసుపత్రిలో చిక్తిస పొందుతూ మృతి చెందారు.
- 20 July 2020 9:38 AM IST
రాజమండ్రిలో కరోనా చికిత్స కోసం 8 హాస్పిటల్స్
రాజమండ్రిలో కరోనా చికిత్స కోసం 8 హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు
1 డిస్ట్రిక్ట్ హాస్పిటల్
2 సాయి హాస్పిటల్
3 కిమ్స్ బొల్లినేని హాస్పిటల్
4 రాజు న్యూరో హాస్పిటల్
5 శ్రీలత హాస్పిటల్
6 డెల్టా హాస్పటల్
7 నవీన్ ఎమర్జెన్సీ హాస్పిటల్
8 యూనివర్సల్ హాస్పిటల్
ఈ హాస్పిటల్స్ లో కరోనా కి వైద్యం చేసే అధికారాలు ఇచ్చారు
- 20 July 2020 9:19 AM IST
విజయవాడలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్!
విజయవాడ:
- నగరంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడానికి సన్నాహాలు.....
- మొత్తం 21 క్లస్టర్లలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు.....
- ఆయా ప్రాంతాల్లో సోమవారం నుండి రాకపోకలపై నియంత్రణ.....
- బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్న అధికార యంత్రాంగం.....
కోవిడ్19 క్లస్టర్లు
పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్.....
- 20 July 2020 9:16 AM IST
ఈరోజు నీటి పారుదలశాఖ అధికారులతో కేసీఆర్ భేటీ
►హైదరాబాద్: మధ్యాహ్నం నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ..
►ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు, నీటి సద్వినియోగంపై చర్చ..
►నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణపై ముసాయిదాను సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్న అధికారులు..
- 20 July 2020 9:14 AM IST
అరసవెల్లి ఆలయంలో దర్శనాలు నిలిపివేత!
శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత..
►నేటి నుంచి ఈ నెల 31వరకు దర్శనాలు నిలిపివేత, నిత్యపూజలు యథాతథం..
- 20 July 2020 9:08 AM IST
సచివాలయ పరీక్షలు వాయిదా?
ఏపీలో కోవిద్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో సచివాలయ పరీక్షలను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది.
- 20 July 2020 9:07 AM IST
జూనియర్ కాలేజీల సిబ్బందికి సడలింపు
కరోనా మహమ్మారి విలయతాండవంతో ఏపీలో అన్ని పనులకు ఆటంకం ఏర్పడింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగడంతో పాటు మరణాలు సైతం ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరిన్ని పనులను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఉపాద్యాయులంతా పాఠశాలలకు వెళ్లి హాజరు కావాలని ఆదేశించడం జరిగింది.



