Relaxation forJunior College Staff in AP: కాలేజీకి వారానికి రెండు రోజులే.. జూనియర్ కాలేజీల సిబ్బందికి సడలింపు

Relaxation forJunior College Staff in AP: కరోనా మహమ్మారి విలయతాండవంతో ఏపీలో అన్ని పనులకు ఆటంకం ఏర్పడింది.
Relaxation forJunior College Staff in AP: కరోనా మహమ్మారి విలయతాండవంతో ఏపీలో అన్ని పనులకు ఆటంకం ఏర్పడింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగడంతో పాటు మరణాలు సైతం ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరిన్ని పనులను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఉపాద్యాయులంతా పాఠశాలలకు వెళ్లి హాజరు కావాలని ఆదేశించడం జరిగింది. అయితే రాష్ట్రంలో దానికి తగ్గట్టు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వెనుకడుగు వేసినట్టు కనిపిస్తోంది. . ఆగష్టు3 నుంచి పాఠశాలలన్నీ రిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా.
పాఠశాలల్లో ఇప్పటికే నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి సంబంధించి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. ఈ పనులను నాణ్యతతో చేసేలా ప్రస్తుతం ఉపాధ్యాయులను పర్యవేక్షించేందుకు అప్పగించారు. దాదాపుగా మరో రెండు, మూడు నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే జూనియర్ కాలేజీలకు సంబంధించి కేవలం కాలేజీలకు వెళ్లి హాజరు వేసుకుని టీచింగ్ కు సంబంధించిన పనులను మాత్రమే పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే పరిస్థితుల్లో కేసులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరికి కొన్ని సడలింపులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొవిడ్-19 నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిబ్బంది వారానికి రెండు రోజులు 50 శాతం మంది హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఇంటర్ విద్యా స్పెషల్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. మిగతా రోజుల్లో 'వర్క్ ఫ్రం హోం'కు అవకాశం ఇచ్చారు. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఉంటున్న వారికి కూడా విధుల నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు అయన చెప్పారు.
బాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMTపక్షుల కోసం ఆరంతస్తుల భవనం.. 2వేల పక్షులు నివసించే అవకాశం
27 Jun 2022 11:27 AM GMTBhimavaram: భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు
27 Jun 2022 11:04 AM GMT
బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTIndian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్ ఎయిర్...
27 Jun 2022 3:30 PM GMTపవన్ సినిమాలో సాయితేజ్ కు యాక్సిడెంట్..?
27 Jun 2022 3:00 PM GMTHealth Tips: ఈ టీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.. రోజు తాగితే చాలా...
27 Jun 2022 2:30 PM GMTరేపు పారిస్కు వెళ్లనున్న సీఎం జగన్
27 Jun 2022 2:15 PM GMT