Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 31 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం త్రయోదశి (ఉ. 8-35 వరకు) తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం (మ. 3-53 వరకు) తదుపరి ధనిష్ఠ, అమృత ఘడియలు (ఉ. 6-57 వరకు) వర్జ్యం (రా. 8-02 నుంచి 9-42 వరకు) దుర్ముహూర్తం (మ. 12-25 నుంచి 1-15 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-44 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-13
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 31 Aug 2020 3:46 PM IST
అమరావతి
పిల్లి మాణిక్యరావు టీడీపీ అధికార ప్రతినిధి
అబద్ధాల అంబటి ... ఆపు నీ అసత్యాలు
పెద్ద గొంతేసుకొని విషప్రచారం చేస్తే ప్రజలు నమ్మరని రాంబాబు గ్రహిస్తే మంచిది.
వైసీపీ నేతలు నీతికి పుట్టినవారే అయితే, చంద్రబాబు అనని మాటలు అన్నట్లుగా విషప్రచారం చేయడం మానుకోవాలి.
దళితుల వెనుకబాటుతనం, జీవనస్థితి గురించి చంద్రబాబు మాట్లాడితే, విషపుత్రిక సాక్షిలో విషప్రచారం చేశారు.
దళితులు, బీసీలు సహా, ఇతరవర్గాలపై జరుగుతున్న దాడులకు, తమప్రభుత్వానికి సంబంధం లేదని అంబటి చెప్పగలడా..?
- 31 Aug 2020 1:46 PM IST
Amaravati updates: తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు..
అమరావతి..
-తెలుగుదేశం పార్టీ నేత చలమలశెట్టి సునీల్ నేడు వైసీపీలో చేరనున్నారు.
-చలమల శెట్టి సునీల్ గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
-ఎన్నికల ఫలితాల నుంచి చలమలశెట్టి సునీల్ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
-ఇటీవల ఆయన వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి.
-కాని కొన్ని కారణాల రీత్యా ఆయన వైసీపీలో చేరలేదు.
-నేడు జగన్ సమక్షంలో చలమలశెట్టి సునీల్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
- 31 Aug 2020 1:34 PM IST
Amaravati updates: అంబటి రాంబాబు ...వైసీపీ ఎమ్మెల్యే..
అమరావతి...
-అంబటి రాంబాబు ...వైసీపీ ఎమ్మెల్యే
-చంద్రబాబు విచిత్రంగా తయారయ్యారు..
-హైదరాబాద్ నుంచి కదలడు, జూమ్ నుంచి బైటకు రాడు, లోకేష్ ట్విట్టర్ వదలడు..
-చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఆంద్రప్రదేశ్ కు నివాసులు కాదు ప్రవాసులు
-చంద్రబాబు జూమ్ బాబు, లోకేష్ ట్విట్టర్ మలోకం అయ్యాడు..
-ఆంద్రప్రదేశ్ లో విఫలమైన ప్రతిపక్షం టీడీపీ..
-దేశంలో ఏ సీఎం చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు..
-60 వేల కోట్లు రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నాలుగున్నర కోట్ల మందికి నేరుగా వేశారు..
-నాలుగు వేల కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశారు..
-దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేశారు..
-దళితులపై దాడులు చేసిన వారి తాట తిస్తామని సీఎం జగన్ హెచ్చరించారు..
-చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి తెల్ల వారితే జగన్మోహన్ రెడ్డి పై బురద జల్లుతున్నారు..
-నేను అక్రమ మైనింగ్ చేస్తున్ననని పిల్ వేశారు..
-నేను ఎలాంటి విచారణకు అయిన సిద్ధంగా ఉన్నాను..
-సీబీఐ విచారణ జరిపిన, రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిన నేను సిద్ధం..
-నాపై వేసిన పిల్ వేసిన వారు మైనింగ్ దొంగలు..
-గత ఏడాది అక్రమ మైనింగ్ చేస్తున్నారని నాపై కేసు వేసిన వారితో పాటు మరో ఐదుగురుపై కేసు రిజిస్టర్ చేయబడింది..
-అధికారులు, నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో కేసులు వేశారు..
-వారికి నేను సహకరించలేదని తప్పుడు కేసు కోర్టులో వేశారు..
-నిరాధార ఆరోపణలకు భయపడను..
-నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తాను..
-నా నియోజకవర్గంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు..
- 31 Aug 2020 1:19 PM IST
Vijayawada updates: సతీసమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పుష్పశ్రీ వాణి
విజయవాడ..
-సతీసమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పుష్పశ్రీ వాణి
-అలయా మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు
-అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పుష్పశ్రీ వాణి దంపతులు
- 31 Aug 2020 1:11 PM IST
Visakhapatnam updates: మంత్రి అవంతీ శ్రీనివాస్ కామెంట్స్....
విశాఖ:
- మంత్రి అవంతీ శ్రీనివాస్ కామెంట్స్....
-దళితులపై హింస ను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించదు....
-చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని
-శ్రీకాంత్ పై అమానుషంగా వ్యవహరించారు...
-నిందితులు ఎంతటి వారైనా
-చట్టం ముందు సమానులే...
-దళితుల పక్షాన
-చంద్రబాబు మాట్లాడ్డం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది...
- 31 Aug 2020 12:56 PM IST
Guntur updates: టీడీపీ నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు!
గుంటూరు....
-అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పని చేస్తున్నారు.
-చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది.
-దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు
-ఎమ్మెల్యే ముస్తాఫా
-చంద్రబాబు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు.
-దళితులకు వైసీపీ చేస్తున్న సంక్షేమ ం చంద్రబాబు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు....
-ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.
-కోర్టులను ఆశ్రయించి సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారు....
-వైసీపీ ఎమ్మెల్యే కిలారిరోశయ్య
-చంద్రబాబు దళితులపై లేని ప్రేమను చూపిస్తున్నారు.
-సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది.
-చంద్రబాబు డివైడ్ అండ్ రూల్ పాలసీ ని అనుసరిస్తున్నారు....
-ఎమ్మెల్యే మద్దాల గిరి
- 31 Aug 2020 12:38 PM IST
Guntur updates: హెచ్ఎంటివి తో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి!
గుంటూరు....
-చంద్రబాబు పాలనలో దళితులపై అనేక దాడులు జరిగాయి....
-టిడిపి హాయంలో దళితులు పై జరిగిన దాడులు ప్రజలోకి తీసుకెళ్తాం...
-దళితులకు రాజధానిలో ఇళ్ళ స్థలాలు అందిస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు....
-అధికారం పోయిన తర్వాత చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు....
-చిల్లర రాజకీయాలు చేస్తున్నారు....
-హెచ్ఎంటివి తో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- 31 Aug 2020 12:33 PM IST
Guntur updates: ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వైసిపి నేతల నిరసన!
గుంటూరు...
-పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వైసిపి నేతల నిరసన.
-అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శ్రీదేవి, ముస్థఫా,గిరి,రోశయ్య.
- 31 Aug 2020 12:27 PM IST
Kadapa district updates: టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డికి కరోన పాజిటివ్ నిర్ధారణ...
కడప :
-టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డికి కరోన పాజిటివ్ నిర్ధారణ...
-స్వయంగా ఆయనే ప్రకటన లో వెల్లడి...
-అనుమానంతో కరోన పరీక్ష చేయించుకోగా ఈ రోజు కరోన పాజిటివ్ అని వెల్లడి...
-వైద్యుల సలహా మేరకు 10 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు ప్రకటన...
- 31 Aug 2020 12:14 PM IST
Guntur updates: గుంటూరులో వైసీపీ అధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం!
గుంటూరు...
-గుంటూరు లోని లాడ్జిసెంటర్ లో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసిన వైసీపీ నేతలు....
-టిడిపి ఉనికిని కాపాడుకోవడానికి దళితులు పై వైసిపి దాడులు చేస్తుదంటు ఆరోపణలు చేస్తున్నారు...
-టిడిపి హాయంలో దళితులు ను ఎలా అవమానించారో ప్రజలలోకి తీసుకెళ్తాం....
-వైసిపికి దళితులు అండగా ఉన్నారు...
-దళితులు ను మాపార్టీ నుంచి దూరం చేయడానికి బాబు అండ్ కో కుట్ర చేస్తున్నారు...
-దళితులు టిడిపి అధికారంలో ఉంటే పీతల సుజాత,రావెలకిషోర్ ,వర్లరామయ్యలను అవమానపరచిన ఘనుడు చంద్రబాబు....
-దళితులు పై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు....
-నేను దళితుడిని సామాన్య కార్యకర్తను ఎంపి చేసిన ఘనత వైఎస్ఆర్సీపి...
-హెచ్ఎంటివి తో ఎంపి నందిగాం సురేష్












