Top
logo

Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
X
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 31 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 31 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం త్రయోదశి (ఉ. 8-35 వరకు) తదుపరి చతుర్దశి. శ్రవణ నక్షత్రం (మ. 3-53 వరకు) తదుపరి ధనిష్ఠ, అమృత ఘడియలు (ఉ. 6-57 వరకు) వర్జ్యం (రా. 8-02 నుంచి 9-42 వరకు) దుర్ముహూర్తం (మ. 12-25 నుంచి 1-15 వరకు తిరిగి మ.2-54 నుంచి 3-44 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-13

ఈరోజు తాజా వార్తలు

Live Updates

 • Vidya Sagar Tribute to Pranab Mukherjee:ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సంతాపం
  31 Aug 2020 3:09 PM GMT

  Vidya Sagar Tribute to Pranab Mukherjee:ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సంతాపం

  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సంతాపం ప్రకటించిన మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

 • CM Jagan: రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్‌ పర్యటన
  31 Aug 2020 3:02 PM GMT

  CM Jagan: రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్‌ పర్యటన

  అమరావతి: రేపు, ఎల్లుండి వైఎస్‌ఆర్‌ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

  01.09.2020 సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయల్దేరనున్న సీఎం

  సాయంత్రం 05.15 గంటలకు ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఎస్టేట్‌ చేరుకోనున్న సీఎం, అక్కడే రాత్రి బస

  02.09.2020 ఉదయం 09.45 గంటలకి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి, ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌

  మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్న సీఎం

 • Nara Lokesh Tribute to Pranab Mukherjee: ప్రణబ్ మరణం తీవ్రంగా కలచివేసింది: నారా లోకేష్
  31 Aug 2020 3:01 PM GMT

  Nara Lokesh Tribute to Pranab Mukherjee: ప్రణబ్ మరణం తీవ్రంగా కలచివేసింది: నారా లోకేష్

  నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి: 

  నాయకుడుగా,ఉపాధ్యాయుడిగా, జర్నలిస్ట్ గా, రాజనీతిజ్ఞుడు, మంత్రి, రాష్ట్రపతిగా ప్రణబ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.

  రాజకీయాల కంటే ప్రజలే ముందు

  భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర సంపాదించారు.

  ప్రణబ్ మరణం తీవ్రంగా కలచివేసింది.ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నాను.

  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

 • Covid19 Updates in Nellore: నెల్లూరులో మరో వారం రోజులు కోవిడ్-19 ఆంక్షలు
  31 Aug 2020 2:58 PM GMT

  Covid19 Updates in Nellore: నెల్లూరులో మరో వారం రోజులు కోవిడ్-19 ఆంక్షలు

  నెల్లూరులో మరో వారం రోజులు కోవిడ్-19 ఆంక్షలు.

  జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నియంత్రణకు చర్యలు.

  సెప్టెంబర్, 2వ తేదీ నుండి సెప్టెంబర్, 8వ తేదీ వరకు 7 రోజుల పాటు నెల్లూరు నగరంలో ఉదయం 6-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంట వరకు మాత్రమే దుకాణాలు పనిచేస్తా యి-- జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు

  -- సెప్టెంబర్, 6వ తేదీ ఆదివారం ఒక్క రోజు మాత్రం సంపూర్ణంగా లాక్ డౌన్ అమలు... కలెక్టర్

 • Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీకి ఏపీ గవర్నర్ ఘన నివాళి
  31 Aug 2020 1:29 PM GMT

  Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీకి ఏపీ గవర్నర్ ఘన నివాళి

  ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

  13 వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలు మరపురానివి

  ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలు ప్రభుత్వం, పార్లమెంటులలో, దేశానికి ఆదర్శప్రాయమైన సేవలను అందించారు.  

  విదేశీ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుదైన ఘనత ప్రణబ్ కే దక్కుతుంది

  సమాచార హక్కు, ఉపాధి హక్కు, ఆహార భద్రత, యుఐడిఎఐ ఏర్పాటు వంటి ముఖ్యమైన చట్టాలకు ప్రణబ్ నాయకత్వం వహించారు

  ప్రణబ్ ముఖర్జీ శక్తివంతమైన వక్త, పండితుడు, మేధావి

  అపారమైన రాజకీయ పరాక్రమం ఉన్న నాయకుడు

  విభిన్న రాజకీయ పార్టీల మధ్య ఐక్యతను ఏర్పరచి, జాతీయ సమస్యలపై ఏకాభిప్రాయం సాధించారు

  దుఃఖంలో ఉన్న ప్రణబ్ కుటుంబసభ్యులకు హృదయపూర్వక సంతాపం

 • BalaKrishna: బాలకృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.
  31 Aug 2020 11:49 AM GMT

  BalaKrishna: బాలకృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.

  అనంతపురం: హిందూపురం లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.

  సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు.

  కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రం గా హిందూపురం ను చేయాలని... మెడికల్ కళాశాలను

  హిందూపురం లో ఏర్పాటు చేయాలని డిమాండ్ తో సమావేశం.

 • 31 Aug 2020 11:10 AM GMT

  తూర్పుగోదావరి -రాజమండ్రి


  రాజమహేంద్రవరం ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రిలో మరోసారి ఆక్సిజన్ కొరత.


  నిన్నటి నుంచి రోగులకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తున్న ఆక్సిజన్ కొరత.


  విలవిలలాడుతున్న ఐసియులోని కోవిడ్ రోగులు .  ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆక్సిజన్ నిల్వలను సరిగా నిర్వహించని ఆసుపత్రి అధికారులు


  రాజమండ్రి కోవిడ్ ఆస్పత్రి ఐసియూలో పూర్తిస్థాయిలో కొవిడ్ రోగులు


  నిన్న సాయంత్రం కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడితే అప్పటికప్పుడు జిల్లాలో అన్నిచోట్ల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను రప్పించిన ఆసుపత్రి అధికారులు


  కొద్దిపాటి వ్వవధిలోనే నిన్న పలువురి ప్రాణాలతో చెలగాటం


  మరలా ఈరోజు కూడా అదే తీవ్రమైన ఆక్సిజన్ కొరత ,


  ఆస్పత్రిలోని ఆక్సిజన్ ట్యాంకర్లో అయిపోయిన నిల్వలు,


  సిలెండర్లతో నిర్వహణ చేస్తున్న ఐసియూ, ఆక్సిజన్ సరిపోక విలవిలలాడుతున్న కరోనా రోగులు .


  ఆక్సిజన్ సిలెండర్ల కోసం పరుగులు తీస్తున్న ఆస్పత్రి అధికారులు


 • 31 Aug 2020 11:09 AM GMT

  విశాఖ...


  విశాఖ పాయకరావుపేట


  వినాయక నిమజ్జనంలో అపశ్రుతి..


  సముద్రానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు.


  పాయకరావుపేట, పెదరామభద్రాపురం గ్రామంలో వినాయక విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేసే క్రమంలో ఒక్కసారిగా అలలు రావడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు.


  పోలిసులు గాలింపు చర్యలు చేపట్టారు.


 • 31 Aug 2020 10:17 AM GMT

  అమరావతి


  చిన్నారిపై లైంగిక వేధింపులను లోకేష్‌ సమర్థిస్తున్నాడా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూటి ప్రశ్న


  పత్రిక ప్రకటన


  చంద్రబాబుగారు చదువుకున్న రాజకీయ స్కూల్‌లోనే లోకేష్‌కూడా చదువుకున్నాడు


  అందువల్ల ఉదాత్తమైన రాజకీయాలు లోకేష్‌చేస్తాడని ఎవ్వరూ అనుకోరు


  అబద్ధాలు, విషప్రచారాలు, ఆధారాల్లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు, తన కొడుకును కూడా అదే దారిలో నడిపిస్తున్నారు


  వీరిద్దరి వ్యవహార శైలి ఈ రాష్ట్రానికి శాపం


  చిత్తూరులో ఒకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనను నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు


  చంద్రబాబే కాదు.. లోకేష్‌ బుర్ర కూడా విషంతో నిండిపోయింది


  ఒక చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో ఒక హెడ్‌మాస్టర్‌పై చట్టప్రకారం చర్య తీసుకున్నారు


  ఈ వ్యవహారంలో సంబంధిత పత్రికా విలేఖరి వ్యవహారం నడపాలని చూస్తే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహించి దాడికి దిగారు


  పోలీసులు చర్య తీసుకుని, దాడికి దిగిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు


  ఈ వ్యవహారాన్ని నాపై రుద్దడం అవివేకం


  లోకేష్‌... మీ తండ్రి ఎలాంటి రాజకీయాలు చేశారో, దాని ఫలితం ఏంటో.. ఇవాళ చూస్తున్నారు


  నువ్వు కూడా అలాంటి రాజకీయాలే చేస్తున్నావు...


  పరనిందలు, ఆధారాల్లేని ఆరోపణలతో ట్వీట్లు మీద ట్వీట్లు పెట్టే మీ శైలేంటో ప్రజలకు మీరే చెప్పుకుంటున్నారు


  ఇలాంటి విష రాజకీయాలు చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుంది


  నిర్మాణాత్మక విమర్శలు చేయండి, స్వాగతిస్తాం


  ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే... తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితె పూజ చేస్తారు


 • 31 Aug 2020 10:17 AM GMT

  అమరావతి


  కె.ఎస్. జవహర్ మాజీ మంత్రి


  దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న జగనే దళితద్రోహి


  ఐదారుగురికి పదవు లిచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి దళితమిత్ర కాడనే నిజాన్ని వైసీపీలోని దళితవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు తెలుసుకోవాలి.


  చంద్రబాబు హాయాంలో దళితులకు ఏం మంచిజరిగిందో, ఈ ప్రభుత్వం వచ్చాక వారిని ఎంతలా హింసిస్తుందో చర్చించడానికి తాము సిద్ధం.


Next Story