Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 27 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం నవమి: (మ. 12-39 వరకు) తదుపరి దశమి జ్యేష్ఠ నక్షత్రం (సా. 4-35 వరకు) తదుపరి మూల అమృత ఘడియలు: (ఉ. 8-11 నుంచి 9-42 వరకు) వర్జ్యం: (రా. 12-18 నుంచి 1-51 వరకు) దుర్ముహూర్తం: (ఉ. 9-57 నుంచి 10-47 వరకు తిరిగి మ. 2-57 నుంచి 3-47 వరకు) రాహుకాలం: (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 27 Aug 2020 11:34 AM IST
Amaravati updates: ఏపీ కేంద్ర పోలీస్ కార్యాలయానికి 20లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను ఎస్ బీ ఐ బహూకరణ..
అమరావతి....
-ఏపీ కేంద్ర పోలీస్ కార్యాలయానికి 20లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను ఎస్ బీ ఐ బహూకరణ..
-ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు అంబులెన్స్ ను అందజేసిన ఎస్ బీ ఐ డీజీఎం రవిమోహన్ సక్సేనా..
- 27 Aug 2020 11:23 AM IST
Amaravati updates: మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..
అమరావతి...
-మంత్రి బొత్స ప్రెస్ రిలీజ్..
-భూ సమీకరణలో భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు 158 కోట్లు
-2 నెలల పెన్షన్ మొత్తం 9.73 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించిన మంత్రి బొత్ససత్యనారాయణ.
-ఆ మొత్తాలు వారి బ్యాంక్ అకౌంట్ ల లో జమ అవుతాయి..
- 27 Aug 2020 11:17 AM IST
Vijayawada updates: ప్రకాశం బ్యారేజి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య
విజయవాడ....
-ప్రకాశం బ్యారేజి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య
-మంగళగిరికి చెందిన షేక్ ఉమర్ గా గుర్తించిన తాడేపల్లి పోలీసులు
-ఉమర్ ను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-కుటుంబ కలహాల నేపద్యంలో బలవన్మరణానికి పాల్పడిన ఉమర్
- 27 Aug 2020 11:13 AM IST
Kurnool-Srisailam updates: శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం
-కర్నూలు జిల్లా
-శ్రీశైలం మహా కుంభకోణంపై మరోసారి విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారుల బృందం
-కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో నెల రోజుల జాప్యం అనంతరం ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడడంతో మళ్లీ మూడోసారి విచారిస్తున్న ఏసిబీ బృందం
-శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అతిథి గృహం వద్ద దేవస్థానంకి సంబంధించిన అన్ని రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు
-ఇదివరకు 2017 నుండి ఇప్పటివరకు ఆన్లైన్ టికెట్ల రికార్డులను మాత్రమే తనిఖీ చేయగా ప్రస్తుతం తాజాగా 2016–17 సంవత్సరానికి సంబంధించి మ్యాన్యువల్ టికెట్ల రికార్డులను పరిశీలించి అవినీతి జరిగితే వారిని అరెస్టు చేసే అవకాశం
-ఈ కుంభకోణంలో ఇప్పటికే 33 మంది అరెస్టు చేసిన అధికారులు
-ఈ కుంభకోనానికి సంబంధించి ఇప్పటికే IPC 406,420,409 మరియు ఐ టి యాక్ట్ 65,66 సెక్షన్లు క్రింద కేసు నమోదు
-కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అందరికీ బెయిలు మంజూరు చేసిన కోర్టు
-విచారణలో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించి వేరువేరుగా పిలిపించి గోప్యంగా విచారిస్తున్న అధికారులు
-కుంభకోణంలో అరెస్టయిన 33 మందిని మరోసారి విచారణ చేయనున్నట్లు సమాచారం
-శ్రీశైలం కుంభకోణంలో 2 కోట్ల 56 లక్షల కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే నిర్ధారించిన ఏసిపి బృందం వాటిని రికవరీ చేసే దిశగా రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి రికవరీ చేసే దిశగా కూడా ప్రయత్నాలు ముమ్మరం
- 27 Aug 2020 10:42 AM IST
Guntur updates: చేబ్రోల్ లోని చతుర్ముక బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం...
గుంటూరు....
-చేబ్రోల్ లోని చతుర్ముక బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం...
-ఎమ్మెల్యెలు వైసిపి కిలారిరోశయ్య, ముస్తాఫా...
-ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు.....
- 27 Aug 2020 10:35 AM IST
Tirumala updates: ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..
తిరుమల :
-ఎస్వీబీసీ ఛానల్ కు రూ 10 లక్షలు విరాళం..
-రూ 10 లక్షల విరాళంను అందించిన విజయవాడకు చెందిన భక్తుడు వెంకట సుబ్బారావు..
-టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి నాదనీరాజనం వేదికపై విరాళం చెక్ ను అందజేసిన భక్తుడు..
- 27 Aug 2020 10:27 AM IST
East Godavari corona updates: తూర్పును కరోనా కుదిపేస్తోంది
తూర్పుగోదావరి
-తూర్పును కరోనా కుదిపేస్తోంది
-జిల్లాలో 53వేల ,567కు చేరుకున్న
-కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
-ఇందులో యాక్టివ్ కేసులు 17వేల649 .
-ఇప్పటివరకూ 35వేల564 మంది కోలుకున్నారు.
-354కు చేరిన కరోనా మృతుల సంఖ్య
-కేసుల తీవ్రతలో కాకినాడ, రాజమండ్రి- లలోనే అధికంగా వున్నాయి.
- 27 Aug 2020 10:23 AM IST
Tirupati updates: ఏర్పేడు సమీపంలో రోడ్డు ప్రమాదం
తిరుపతి..
-ఏర్పేడు సమీపంలో రోడ్డు ప్రమాదం
-పోలీసు వాహనాన్ని ఢీకొన్న లారీ
-ముగ్గురు పోలీసులకు గాయాలు
-ఒకరి పరిస్థితి విషమం..
- 27 Aug 2020 10:19 AM IST
East Godavari weather updates: -రాజమండ్రి- ఏజన్సీ, కోనసీమ ప్రాంతాలతో సహా పలు ప్రాంతాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు
తూర్పుగోదావరి
-రాజమండ్రి- ఏజన్సీ, కోనసీమ ప్రాంతాలతో సహా పలు ప్రాంతాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు
- 27 Aug 2020 9:12 AM IST
Nellore district updates: మండల కేంద్రము వరికుంటపాడులో నెంబరు 565 హై వే పై సెబ్ అధికారుల తనిఖీలు.
-నెల్లూరు స్క్రోలింగ్:--
-మండల కేంద్రము వరికుంటపాడులో నెంబరు 565 హై వే పై సెబ్ అధికారుల తనిఖీలు. బెంగుళూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న 39 మధ్యం బాటిళ్లు పట్టుకొన్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు
-మద్యం లోడుతో వెళ్తున్న మినీ వ్యాను, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు
-బెంగళూరు నుంచి నరసరావుపేటకు ద్రాక్ష లోడ్ మాటున తీసుకెళ్తున్న అక్రమార్కులు



