Live Updates: ఈరోజు (25 అక్టోబర్, 2020 ) బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. రెండు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో వైభవంగా కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా కొన్ని నెలలుగా పండుగలకు దూరం అయిపోయిన ప్రజలు ఈసారి దసరా పండుగను కరోనా నిబంధనల నేపథ్యంలోనే సంబరంగా జరుపుకుంటున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Oct 2020 4:28 PM IST
Avanthi Srinivas Comments: విశాఖ చరిత్రలో ఈరోజు మరిచిపోలేని రోజు..
విశాఖ..
//13 జిల్లాలలో విశాఖపట్నం పెద్ద జిల్లా
//మెట్రో ప్రారంభమైతే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయి
//వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి
- 25 Oct 2020 4:23 PM IST
Bhupalpally: మహాదేవపూర్ మండలం లో విషాదం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
-మహాదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామానికి చెందిన మహేష్ మృతి
-టీఎస్ ఎమ్ డీసీలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మహేష్
-మహేష్ మృతిపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు
- 25 Oct 2020 4:19 PM IST
Visakha updates: మెట్రో రైలు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ...
విశాఖ...
//ఎల్ ఐ సీ బిల్డింగ్ లో మెట్రో రైలు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ
//పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్, మెట్రో ఎం.డి ఎం పి. సత్యనారాయణ, కలెక్టర్ వినయ్ చంద్
- 25 Oct 2020 4:17 PM IST
Bhadradri Kothagudem updates: ఈశ్వర్ అనే వ్యక్తి ని పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చిన మావోయిస్టులు..
భద్రాద్రి కొత్తగూడెం..
# చర్ల మండలం తిప్పాపురం..
//చెన్నాపురం అటవీప్రాంతంలోని రహదారి పై ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి ని పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చిన మావోయిస్టులు.
//ఈ నెల 18 వ తేదిన ములుగు జిల్లా రంగానర్సింహసాగర్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు మణుగూరు దళ కమాండర్ సుదీర్, దళ సభ్యడు లక్మా ఎనద కౌంటర్ కు ప్రతీకారంగా ఈ హత్యకు పాల్పడ్డ మావోయిస్టులు.
//మృతుడు ఈశ్వర్ హోంగార్డుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది
- 25 Oct 2020 4:11 PM IST
Nirmal district updates: అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు మణి శర్మ ..
నిర్మల్ జిల్లా // బాసర
-విజయ దశమి సందర్భముగా అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ ..
-కూతురు కామాక్షి వసంత కార్తీక కి అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీ కార పూజలు ...
- 25 Oct 2020 4:04 PM IST
Bhadradri Kothagudem district: చెన్నాపురం అటవీప్రాంతం లో మృతదేహం కలకలం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
# చర్ల మండలం చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లా పామేడ్ సరిహద్దు ప్రాంతం చెన్నాపురం అటవీప్రాంతం లో మృతదేహం కలకలం
#చర్ల మండలం కు చెందిన టీఆర్ఎస్ నేతను మావోయిస్టులు హత్య చేసినట్లు ప్రచారం
#దృవీకరించని పోలీసులు
- 25 Oct 2020 3:59 PM IST
Vijayawada updates: దుర్గమ్మ దేవస్థానంలో పూర్ణాహుతి తో ముగిసిన దసరా ఉత్సవాలు..
విజయవాడ
//9రోజులపాటు జరిగిన దసరా ఉత్సవాల్లో 10 అలంకారంలో దర్శనం ఇచ్చిన దుర్గమ్మ
//రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం..
- 25 Oct 2020 3:54 PM IST
West Godavari updates: విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత..
పశ్చిమ గోదావరి జిల్లా...
--- చాగల్లు మండలం బ్రహ్మణగూడెం గ్రామం శివాలయంలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి తానేటి వనిత
-- అనంతరం సుమారు 75 లక్షలతో నూతనంగా నిర్మాణం చేస్తున్న గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్ర భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత
- 25 Oct 2020 3:44 PM IST
Hyderabad updates: అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష..
హైదరాబాద్...
-- హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష
-- వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్
-- ఈ రోజు దసరా పండుగ జరుపుకోకుండా వరద బాధితులను రక్షించాలని డిమాండ్ చేస్తున్నట్టు మోత్కుపల్లి ప్రకటన
- 25 Oct 2020 3:35 PM IST
Chittoor district updates: జిల్లాలో సాగు నీటి కోసం వివాదం...
చిత్తూరు జిల్లా..
//నాయునివారిపల్లెలో అన్నదమ్ముల గొడవ
//పెదనాన్న, ఆయన కొడుకు పై అన్న కుటుంబం వేట కొడవళ్లతో దాడి
//ఇదరికి త్రీవ గాయాలు












