Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19.
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Aug 2020 2:03 PM IST
Road Accident in Patancheruvu: రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చేరు మండలం రుద్రారం వద్ద జాతీయ రహదారి పై ఆటోను ఢీ కొన్న ట్రాక్టర్ .
ఆటోడ్రైవర్ తో పాటు రోడ్డు పక్కన నిలుచున్న రమేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలు. ఆసుపత్రి తరలింపు.
అదుపుతప్పి పక్కన ఉన్న కిరాణం షాప్ లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్. తాగిన మైకంలో ట్రాక్టర్ డ్రైవర్.
కిరాణం షాప్ తో పాటు పలు వాహనాలు ధ్వంసం,
- 22 Aug 2020 2:01 PM IST
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చేరు మండలం రుద్రారం లోని సిద్ది వినాయక దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
- 22 Aug 2020 1:57 PM IST
Uttam Kumar comment on Revanth Reddy Arrest: రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అరాచకం. అప్రజాస్వామికం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు.
శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన సంఘటన ను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి లను అరెస్ట్ చేయడం దారుణం, అరాచకం, అప్రజాస్వామికం..
ప్రజాప్రతినిధులు గా సంఘటనను పరిశీలించడం, బాధితులను పరామర్శించడం కనీస బాధ్యత..
తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుంది. ప్రభుత్వ తప్పిదాలు బయట పడతాయని పోలీసులను ప్రభుత్వం ఉపయోగించి నిర్బందానికి పాల్పడుతోంది..
రేవంత్, మల్లు రవి లను వెంటనే విడుదల చేసి శ్రీశైలం సంఘటన స్థలాన్ని సందర్శించే విధంగా ఏర్పాటు చేయాలి..
- 22 Aug 2020 1:53 PM IST
Saraswati Barrage Updates: సరస్వతి బ్యారేజ్ 10 గేట్లు ఎత్తిన అధికారులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
సరస్వతి బ్యారేజ్ 10 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 114.750 మీటర్లు
పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 3.58 టీఎంసీ
ఇన్ ఫ్లో 1,05,000 క్యూసెక్కులు
ఓట్ ఫ్లో 98,000 క్యూసెక్కులు
- 22 Aug 2020 1:17 PM IST
MP Revanth Reddy Arrest: ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్
ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను దిండి వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు
- 22 Aug 2020 1:14 PM IST
MP Revanth Reddy: శ్రీశైలం దుర్ఘటన: పరమర్శించడానికి వెళుతోన్న ఎంపీ రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.
ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాల పరామర్శకు వెళుతోన్న ఎంపీ రేవంత్ రెడ్డిని దిండి వద్ద అడ్డుకున్న పోలీసులు.
పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.
చనిపోయిన కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉంది ...
వారిని పరామర్శించి, న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అడిగాల్సిన అవసరం ఉంది...
మమ్మల్ని ఆపడం సరికాదు ...
కావాలంటే పోలీసు వెహికిల్ లోనే వస్తా ..
సీబీసీఐడీ ఉంది... సీన్ ఆఫ్ అఫెన్స్ కు ఇబ్బంది అనుకుంటే, ఆ పరిధి వరకు తాడు కట్టుకోండి.
- 22 Aug 2020 1:04 PM IST
Khairatabad Ganesha Idol: ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు
పది కిలోల వెండిని దేవుడికి బహుకరించిన ఎమ్మెల్యే దానం
- 22 Aug 2020 1:02 PM IST
Khairatabad Ganesha Idol: ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు
పది కిలోల వెండిని దేవుడికి బహుకరించిన ఎమ్మెల్యే దానం
- 22 Aug 2020 12:55 PM IST
Pocharam Project: నిండు కుండలా పోచారం ప్రాజెక్టు
కామారెడ్డి జిల్లా: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో నిండుకున్న పోచారం ప్రాజెక్టు
పోచారం ప్రాజెక్ట్
ప్రస్తుతం. 1464.00 Ft/ 1464.00 Ft
కెపాసిటీ 1.820/1.820 TMC
ఇన్ ఫ్లో 1902 క్యూసెక్కులు ఔట్ ఫ్లో కెనాల్ ద్వారా 100 క్యూసెక్కులు
- 22 Aug 2020 9:59 AM IST
Warangal: విద్యుత్ షాక్ తో మహిళ మృతి
వరంగల్ రూరల్ జిల్లా:
- విద్యుత్ షాక్ తో మహిళ మృతి
- నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో మనుబోతుల మమత (29) అనే మహిళ ఇంటి వద్ద బట్టలు ఆరబెట్టే క్రమంలో తీగపై బట్టలు అరవేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు తీగకు కరెంటు సప్లై కావడంతో సృహ కోల్పోయింది.
- గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి..










