Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • విషాదం: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి..
    22 Aug 2020 8:50 AM GMT

    విషాదం: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి..

    శ్రీకాకుళం జిల్లా: రాజాం మండలం కొండంపేట గ్రామంలో విషాదం..

    భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి..

    సలాది రామారావు (75) ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి..

    రామారావు చనిపోయిన కొద్దిసేపటికే భార్యా నిర్మల మృతి..

    కొండంపేట గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు..

  • Ramana Deekshitulu Comments on TTD; మరో మారు టీటీడీ పై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు..!
    22 Aug 2020 8:48 AM GMT

    Ramana Deekshitulu Comments on TTD; మరో మారు టీటీడీ పై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు..!

    తిరుమల: మరో మారు టీటీడీపై ట్వీటర్ వేదికగా విమర్శలు చేసిన శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు

    సీఎం జగన్ నన్ను వెంటనే తిరిగి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకునిగా నియమించాలని అని ఆదేశించారు

    సీఎం ఆదేశాలు పక్కనబెట్టి టీటీడీ నాకు గౌరవ ప్రధాన అర్చక హోదా ఇచ్చారు

    వంశపర్యంపర్య హోదాలో ఆలయ ప్రధాన అర్చకుడిగా ఇవ్వడానికి నిరాకరించి, వేచి ఉండాలని పట్టుబట్టింది టీటీడీ

    మునుపటి లాగా వంశ పార్యంపర్య ఆలయ ప్రధాన అర్చకులుగా సీఎం జగన్ ఆదేశాలను అమలు చేయాలని కోరుతున్నా

    సీఎం ఆదేశాల కోసం పారంపర్య అర్చకులు వేచియున్నాం

    సీఎం జగన్, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ట్విట్ లో ట్యాగ్ చేసిన రమణ దీక్షితులు

  • బలహీనంగా ఏటుగట్టు..
    22 Aug 2020 8:42 AM GMT

    బలహీనంగా ఏటుగట్టు..

    తూర్పుగోదావరి : ముమ్మిడివరం ఐ.పోలవరం మం. కేశనకుర్రు పాలెం వద్ద బలహీనంగా ఏటుగట్టు..

    - ఏటుగట్టు నుంచి కాల్వలోకి వస్తున్న వరదనీరు గండి పడే అవకాశం ఉందని భయాందోళనలో స్థానికులు..

  • Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద
    22 Aug 2020 8:39 AM GMT

    Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద

    నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.

    18 గేట్లు ఎత్తివేత.

    ఇన్ ఫ్లో :4,25,418 క్యూసెక్కులు.

    అవుట్ ఫ్లో : 3,45,307 క్యూసెక్కులు.

    పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు.

    ప్రస్తుత నీటి నిల్వ : 306.6922 టీఎంసీలు.

    పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు.

    ప్రస్తుత నీటిమట్టం: 588.20 అడుగులు.

  • Covid Hospital: రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ బెడ్స్ లో వెంటిలేటర్ సెక్షన్ ప్రారంభం
    22 Aug 2020 8:37 AM GMT

    Covid Hospital: రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో కోవిడ్ బెడ్స్ లో వెంటిలేటర్ సెక్షన్ ప్రారంభం

    తూర్పుగోదావరి: రామచంద్రపురం ఏరియా ఆస్పత్రి కోవిడ్ బెడ్స్ లో వెంటిలేటర్ సెక్షన్ ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి.

     

  • Godavari Updates: నిలకడగా వరద గోదావరి
    22 Aug 2020 7:22 AM GMT

    Godavari Updates: నిలకడగా వరద గోదావరి

    తూర్పుగోదావరి -రాజమండ్రి: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గత 4 గంటలు గా నిలకడగా వరద గోదావరి నీటిమట్టం

    18.50 అడుగుల నీటిమట్టం వద్ద మూడో ప్రమాద స్థాయి దాటి కొనసాగుతున్న ప్రవాహం

    ధవలేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి 20లక్షల 27వేల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి విడుదల

    రాజమండ్రి- గోదావరి ఎగువన భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

    భద్రాచలం నుంచి 13 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో

    పోలవరం కాఫర్ డ్యాం ఎగువ 30.21 మీటర్ల వరద నీటిమట్టం

    82 గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే...

    ఏజన్సీ దేవీపట్నం ,చింతూరు,ఎటపాక, విఆర్ పురం, సీతానగరం, కడియం , ఆలమూరు, కొత్తపేట , రావులపాలెం ,ఆత్రేయపురం , కపిలేశ్వరపురం, కె.గంగవరం , పి,గన్నవరం , మామిడికుదురు, సఖినేటిపల్లి, రాజోలు ,మలికిపురం, అయినవిల్లి, అల్లవరం , ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన , తాళ్ళరేవు మండలాల్లో పలు గ్రామాలలో ముంపు

    దేవీపట్నం పూర్తిగా జలదిగ్భంధం..

  • Kanipakam Special worships: కాణిపాకం ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు
    22 Aug 2020 7:20 AM GMT

    Kanipakam Special worships: కాణిపాకం ఆలయంలో ప్ర‌త్యేక పూజ‌లు

    చిత్తూరు: కాణిపాకం ఆలయంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

    రాష్ట్రంలో ప్రజలు ఇళ్లల్లో కుటుంబసభ్యలతో కలిసి వినాయక చవితి జరుపుకోవాలని కోరాం. అలయాల్లోనూ కోవిడ్ నిబంధనలు ఆదేశించాం.

    జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు.

    రైతులు బాగుండటం చూడలేక చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

    ఢిల్లీ లో చెట్టు కింద కూర్చుని కామెంట్స్ చేస్తున్న రఘురామకృష్ణంరాజు కాణిపాకం ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటేనైనా బుద్ధి అయినా వస్తుంది.

    కులాలు, మతాలపై సిగ్గు విడిచి మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజు గురించే మాట్లాడితే ఆ పాపం మాకు కూడా వస్తుంది....దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

  • Amaravathi Farmers Protest:  రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం: అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్
    22 Aug 2020 7:13 AM GMT

    Amaravathi Farmers Protest: రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం: అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్

    విజయవాడ: అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ శివారెడ్డి

    వినాయకుడు రాష్ట్రానికి విఘ్నాలన్నీ తొలగించాలి

    అమరావతిని రాజధానిగా నిలపడానికి ఉన్న విఘ్నాలు వినాయకుడు తొలగించాలి

    రేపటికి నిరసనలకు 250 రోజులు పూర్తవుతుంది

    రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం అనే నినాదంతో రేపు ఉదయం నుంచీ నిరసనలు జరుగుతాయి

    అమరావతి పరిరక్షణ సమితి తరఫున ప్రతీ ఒక్కరికీ ఒక మొక్క కూడా రేపు ఇస్తాం

    ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మార్చుకునేలా ఆ విఘ్నేశ్వరుడు ప్రభుత్వానికి బుద్ధినివ్వాలి

  • AP Deputy CM: కాణిపాకం ఆలయంలో డిప్యూటీ సీఎం ప్ర‌త్యేక పూజ‌లు
    22 Aug 2020 7:09 AM GMT

    AP Deputy CM: కాణిపాకం ఆలయంలో డిప్యూటీ సీఎం ప్ర‌త్యేక పూజ‌లు

    చిత్తూరు: కాణిపాకం ఆలయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్ర‌త్యేక పూజ‌లు

    రాష్ట్రంలో సీఎం జగన్ పాలన కులాలు పార్టీలకతీతంగా కొనసాగుతోంది.

    మానవసేవే మాధవసేవ అన్న దృక్పథంతో పని చేస్తున్న సీఎం జగన్ కు గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం...డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

  • 22 Aug 2020 4:48 AM GMT

    East Godavari: కాపర్ డ్యాం వద్ద సుడులు తిరుగుతోన్న గోదావరి..

    తూర్పుగోదావరి :

    - భద్రాచలం నుంచి వస్తున్న వరద నీటితో కాపర్ డ్యాం వద్ద సుడులు తిరుగుతోన్న గోదావరి..

    - 30.14 మీటర్లకు చేరుకున్న నీటి మట్టం..

    - ఇబ్యాక్ వాటర్ రూపంలో దేవీపట్నం మండలాన్ని మరోసారి ముంచెత్తిన వరద గోదావరి..

    - గత తొమ్మిది రోజులు గా జలదిగ్బంధంలో ఉన్న దేవీపట్నం మండలం లోని 36 ముంపు గ్రామాలు..

    - జలదిగ్బంధంలో దేవీపట్నం, పోశమ్మ గండి, పూడిపల్లి, తొయ్యేరు, అగ్రహారం, మంటూరు, పెనికెలపాడు, తున్నూరు, కచ్చులూరు, కొండమొదలు, సహా 36 గ్రామాలు.

    - తొమ్మిది రోజులుగా తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరద బాధితులు..

    - పునరావాస కేంద్రం లో తప్ప గ్రామాలకు అందని వరద సహాయం, పునరావాస కార్యక్రమాలు..

    - కచ్చులూరు కొండపై నుంచి వెలగపల్లి చేరుకుని నిత్యావసరాల కోసం అక్కడి రంపచోడవరం వెళ్తోన్న వరద ముంపు బాధితులు..

    - గత 9 రోజులుగా అంధకారంలో 36 ముంపు గ్రామాలు.

    - కనీసం కొవ్వొత్తులు, కిరోసిన్ అయినా సరఫరా చేయాలని అధికారులను కోరుతున్న వరద బాధితులు.. పట్టించుకోని స్థానిక అధికారులు.

    - దేవీపట్నం మం. లో సెక్షన్ 144 విధించిన రంపచోడవరం ఐటిడిఏ పి ఓ ప్రవీణ్ ఆదిత్య..

    - బయట వ్యక్తులు ఎవరూ ముంపు గ్రామాలకు వెళ్ళడానికి వీలు లేదని హెచ్చరిక..

    - దేవీపట్నం మండలం లో వరద కవరేజీ విషయంలో మీడియా పైన ఆంక్షలు విధించిన ఐటిడిఏ పిఓ..

Print Article
Next Story
More Stories