Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 22 Aug 2020 10:59 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 22 Aug 2020 4:58 PM IST

    జాతీయం

    - దేశంలోని అన్ని రాష్ట్రాల ఛీప్ సెక్రటరీ లకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా లేఖ

    - అంతర్ రాష్ట్ర , ఒక రాష్ట్ర రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వ్యక్తుల కదలికలు, వస్తువుల సరఫరా పై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

    - ఏ రాష్ట్ర మైనా ఆంక్షలు విధించినట్లయితే అది కేంద్ర హోం శాఖ జారీచేసిన ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని లేఖలో పేర్కొన్న కేంద్ర హోం సెక్రటరీ

  • 22 Aug 2020 4:57 PM IST

    Chittoor: కీచక ప్రధానోపాధ్యాయుడు.

    చిత్తూరు:

    - కీచక ప్రధానోపాధ్యాయుడు.

    - పదవ తరగతి విద్యార్థిని లపై లైంగిక వేధింపులు.

    - తల్లిదండ్రులు,గ్రామస్తులు ఆగ్రహం..

    - రెండు సంవత్సరాలగా వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

    - లాక్ డౌన్ వల్ల ఇంటి వద్దనే విద్యార్థిని.

    - స్కూల్ లు కూడా లేకపోవడం తో నేరుగా విద్యార్థిని‌ ఇంటికే వెళ్లిన ఉపాద్యాయుడు.

    - అనుమానం తో ప్రశ్నించిన ప్రాదానో పాద్యుడిని నిలదీసిన తల్లిదండ్రులు గ్రామస్తులు

    - దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత

  • 22 Aug 2020 4:55 PM IST

    తూ గో:

    - కే. గంగవరం మండలం కోటిపల్లి, గ్రామంలో గోదావరి వరద ఉధృతిని, వలన

    - నీటమునిగిన మత్స్యకార గృహాలను పరిశీలించిన ...

    - బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి.

  • 22 Aug 2020 3:38 PM IST

    Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమ క్రమంగా పెరుగుతున్న వరద..

    విజయవాడ:

    - ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమ క్రమంగా పెరుగుతున్న వరద..

    - ప్రతీసారి లక్ష క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

    - ప్రస్తుతం ఔట్ ఫ్లో 1,13,200 క్యూసెక్కులు

  • 22 Aug 2020 3:36 PM IST

    Krishna District: అక్రమ మద్యం రవాణా కోసం వినూత్న పద్ధతులు అనుసరిస్తున్న కేటు గాళ్ళు

    కృష్ణా జిల్లా:

    - అక్రమ మద్యం రవాణా కోసం వినూత్న పద్ధతులు అనుసరిస్తున్న కేటు గాళ్ళు

    - ఖాళీ గ్యాస్ సిలిండర్లు లో వెనక భాగం కట్ చేసి అక్రమ మద్యం తరలింపు చేస్తున్న వ్యక్తుల పై నిఘా పెట్టిన పోలీసులు

    - వత్సవాయి వద్ద గ్యాస్ సిలిండర్ లో వంద బాటిల్స్ అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను, రెండు బైకులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు

  • 22 Aug 2020 3:06 PM IST

    Nimmala Ramanaidu: నిమ్మల రామానాయుడు టీడీపీ ఎమ్మెల్యే

    అమరావతి:

    - నిమ్మల రామానాయుడు టీడీపీ ఎమ్మెల్యే

    - హామీలిచ్చేటప్పుడు ఆకాశం వైపు చూసి... అమలు చేసేటప్పుడు నేలచూపులా?

    - వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

    - ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులకు రూ.2వేల సాయం చేశారు.

    - తాగునీరు, ఆహారం లేక ముంపుప్రాంతాల్లోని వృద్ధులు, మహిళలు, చిన్నారులు అలమటిస్తున్నారు.

    - పాలకుల దృష్టంతా కక్షసాధింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగ్ లపైనే ఉంది.

    - గత ఏడాది రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించారు.

    - తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జగన్ పాదయాత్రలో ఉండికూడా ప్రజల ముఖం చూడలేదు.

    - ఆగస్ట్ 8, 2019న ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి జగన్, ప్రతి వరదబాధిత కుటుంబానికి రూ.5వేలు సాయం చేస్తానని, ఇళ్లుకోల్పోయి, పంటనష్టపోయిన వారిని ఆదుకుంటానని చెప్పాడు.

    - నాడు ఆయన చెప్పిన హామీలేవి అమలుకాకుండానే, మళ్లీ వరదలు వచ్చాయి.

    - తాజాగా మరలా ముఖ్యమంత్రి ఆకాశం నుంచే బాధితులపై వరాల జల్లు కురిపించి వెళ్లిపోయాడు.

    - విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయని వాలంటీర్ వ్యవస్థ ఎవరికోసం పనిచేస్తోంది.

    - తిత్లీ, హుద్ హుద్ తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశారో ప్రజలందరూ చూశారు.

    - జగన్ లా చంద్రబాబు ఆనాడు రాజప్రాసాదాల్లో కూర్చోలేదు.

    - ప్రజల మధ్యనే ఉండి, గంటలవ్యవధిలోనే తుఫాను బాధితులకు నిత్యావసరాలు, పాలు అందించేలా చేశారు.

    - కరోనా వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి జగన్ కేవలం 5సార్లు మాత్రమే బయటకు వచ్చారు.

    - జగన్ ధోరణి చూస్తుంటే, కరోనా బాధితుల మాదిరే వరద బాధితులు కూడా వరదతో సహజీవనం చేయాలన్నట్లుగా ఉంది.

  • 22 Aug 2020 3:03 PM IST

    తూర్పుగోదావరి:

    - మామిడికుదురు మం అప్పనపల్లిలో తమకు నీళ్ళు,పాలు, భోజనాలు అందడం లేదని వరద బాధితులు ఆవేదన

  • 22 Aug 2020 2:30 PM IST

    తూర్పు గోదావరి: ఐ.పోలవరం పశువుల లంకలో గోదావరి గట్టు కి తూర ఉండటంతో గోదావరి నీరు గ్రామాల వైపు చేరుతున్న వైనం ..భయంతో గ్రామస్తులు..

  • Alchol  Seize: భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.
    22 Aug 2020 2:28 PM IST

    Alchol Seize: భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.

    కృష్ణా జిల్లా: పోలీస్ తనిఖీలలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.

    *జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు మైలవరం,జి.కొండూరు పోలీస్ స్టేషన్ ల పరిధిలో చేపట్టిన వాహన తనిఖీలు

    భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర మద్యం 1685 బాటిల్స్, ఒక కారు, 2 ద్విచక్ర వాహనాల ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు

  • Huge leakage in Gautami Godavari: గౌతమీ గోదావరిలో మరో భారీ లీకేజీ
    22 Aug 2020 2:23 PM IST

    Huge leakage in Gautami Godavari: గౌతమీ గోదావరిలో మరో భారీ లీకేజీ

    తూర్పుగోదావరి: గౌతమీ గోదావరిలో మరో భారీ లీకేజీ

    ఐ పోలవరం మండలం పశువుల్లంక వద్ద గయ్యాళి తూం నుంచి భారీగా చొచ్చుకు వస్తన్న వరద నీరు..

    గండి పడే ప్రమాదం..వరిచేలను ముంచెత్తనున్న వరద

    ఇసుకబస్తాలతో అడ్డుకట్టవేసేఁదుకు అధికారుల చర్యలు..

    సుమారు ఐదొందల మంది పని చేస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story