Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Nov 2020 6:04 PM IST
Tirumala Updates: రమణారెడ్డి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళం!
తిరుమల
* బెంగళూరుకు చెందిన భక్తుడు రమణారెడ్డి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ .10 లక్షలు విరాళంగా ఇచ్చారు.
* విరాళం డిడిని టీటీడీ ఈవో జవహర్ రెడ్డికి అందజేశారు
- 6 Nov 2020 6:00 PM IST
Guntur Updates: జి.జి.హెచ్. ఐసియు లో నుండి నడుచుకుంటూ వచ్చిన నాగేంద్రబాబు..
గుంటూరు...
-నాగేంద్రబాబు ను కట్టు దిట్ట మైన పోలీసు బందోబస్తుతో విజయవాడకు తరలింపు.
-విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు డిశ్చార్జి.
-జిజిహెచ్ నుండి డిశ్చార్జి చేసి విజయవాడ తీసుకెళ్ళిన పోలీసులు...
- 6 Nov 2020 5:24 PM IST
Krishna District Updates: పామర్రు జడ్పీహెచ్ స్కూల్లో కరోనా కలకలం...
కృష్ణాజిల్లా:
- ఇద్దరు విద్యార్దులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ.
- మండల పరిధి అడ్డాడ జడ్పీహెచ్ స్కూల్లో మరో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నమోదు.
- 6 Nov 2020 5:19 PM IST
East Godavari Updates: తుపానులు,భారీ వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయిoది!
తూర్పుగోదావరి - అనపర్తి
* మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
* భారీ వర్షాలకు నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించాలని కోరుతూ బిక్కవోలు తహసీల్దార్ కు వినతిపత్రం అందచేసిన మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
* ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు 10-15 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుంది
* రెండో పంటకు పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి రైతుకు ఏర్పడింది
* కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- 6 Nov 2020 10:51 AM IST
Amaravati Updates: జగన్ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకువెళతాం..
అమరావతి...
-మంత్రి బొత్స సత్యనారాయణ... కామెంట్స్...
-ఏడాదిన్నరగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే ఉన్నారు..
-పాదయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు అమలు చేశారు..
-దేశ చరిత్రలో ఏడాదిలోనే 90 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన సీఎంగా జగన్ నిలిచిపోతారు..
-ప్రతిపక్షాల దుష్టమైన ఆలోచనలు ప్రజలకు వివరిస్తాం..
- 6 Nov 2020 10:46 AM IST
Anantapur District Updates: జిల్లాలో 59 మంది టీచర్ల కు కరోనా..
అనంతపురం:
-18 మంది విద్యార్థులకు పాజిటివ్.
-మొత్తం 14424 మంది టీచర్లు, 1212 మంది విద్యార్థుల కు ఇప్పటి వరకు కోవిడ్ పరీక్షలు.
- 6 Nov 2020 10:40 AM IST
Tirumala Updates: శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు...
తిరుమల..
// శ్రీవారి పాదాల చెంత పీఎస్ఎల్వి సీ 49 నమునాకు ఇస్రో ప్రత్యేక పూజలు
// ఈఓఎస్ 01 స్వదేశీ ఉపగ్రహంతో పాటు, 9 విదేశి ఉపద్రహాలను గగణతలంలోకి తీసుకెళ్లనున్న సీ49
// భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయనున్న ఈఓఎస్ 01
// ఇవాళ మధ్యాహ్నం 01.02 గంటలకు కౌండౌన్ ప్రారంభం
- 6 Nov 2020 10:37 AM IST
Amaravati Updates: ప్రజల్లో నాడు... ప్రజలకోసం నేడు కార్యక్రమం..
అమరావతి...
// తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ప్రజల్లో నాడు... ప్రజలకోసం నేడు కార్యక్రమం..
// హాజరైన సజ్జల, మంత్రులు బొత్స, అనిల్ కుమార్, వేణు గోపాల్, పార్టీ నేతలు, కార్యకర్తలు..
- 6 Nov 2020 10:36 AM IST
Visakha Updates: కటికి జలపాతం దగ్గర రోడ్డు ప్రమాదం!
విశాఖ
- అరకు లోయ బొర్రా పంచాయతీ కటికి జలపాతం దగ్గర రోడ్డు ప్రమాదం
- జీపు బోల్తా పడడంతో నలుగురు పర్యాటకులకు గాయాలు
- అరుకు ఏరియా హాస్పిటల్ కు తరలింపు
- 6 Nov 2020 9:58 AM IST
Amaravati Updates: కాసేపట్లో టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన..
అమరావతి :
* ఇప్పటికే పొలిట్ బ్యూరో, పార్టీ జాతీయ కమిటీ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించిన టీడీపీ













