Live Updates: ఈరోజు (06 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 06 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | షష్ఠి రా.2-33 తదుపరి సప్తమి | పునర్వసు నక్షత్రం తె.4-31 తదుపరి పుష్యమి | వర్జ్యం సా.4-09 నుంచి 5-48 వరకు | అమృత ఘడియలు రా.2-05 నుంచి 3-41 వరకు | దుర్ముహూర్తం ఉ.8-20 నుంచి 9.05 వరకు తిరిగి మ.12-06 నుంచి 12-52 వరకు | రాహుకాలం ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Nov 2020 7:30 PM IST
Kadapa District Updates: జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్..
కడప :
- జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి సర్కిల్ రామాపురం పరిధిలోని పాలకొండ అటవీ ప్రాంతంలో గత 48 గంటలుగా పోలీసుల కూంబింగ్ ఆపరేషన్..
- పోలీసుల అలికిడి విని పరారైన తమిళ కూలీలు.. ఘటనా స్థలంలో 10 దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..
- పరారైన తమిళ కూలీల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసు బృందాలు..
- 6 Nov 2020 7:26 PM IST
West Godavari Updates: జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు..
పశ్చిమ గోదావరి జిల్లా....
- జీలుగుమిల్లి చెక్ పోస్ట్ మరియు నేర్సుగూడెం గ్రామ శివారుల లో వాహన తనిఖీలు చేపట్టిన జీలుగుమిల్లి పోలీసులు.
- తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రా కి అక్రమం గా మద్యాన్ని తరలిస్తున్న నలుగురిని పట్టుకున్న పోలీసులు.
- వారి వద్ద నుండి ₹ 13,950/- విలువైన 22 మద్యం బాటిళ్లు , రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం.
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న జీలుగుమిల్లి పోలీసులు.
- 6 Nov 2020 7:20 PM IST
National Updates: ఢిల్లీ పర్యటనలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..
జాతీయం
// కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి అయిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.
// పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలపై కేంద్రమంత్రితో చర్చించనున్న బుగ్గన
- 6 Nov 2020 7:01 PM IST
Nellore Updates: సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజ్యసభ సభ్యులు..
నెల్లూరు:
--- సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, టిటిడి బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి.
-- అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిం చిన వేమిరెడ్డి దంపతులు.
-- ఆలయయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసులురెడ్డి.
- 6 Nov 2020 6:56 PM IST
Nellore Updates: శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన షార్ గ్రూప్ డైరెక్టర్..
నెల్లూరు:
--- సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన షార్ గ్రూప్ డైరెక్టర్ గోపికృష్ట..
--- పీఎస్ఎల్వి సీ-49 రాకెట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ గోపికృష్ట పూజలు.
--- ప్రయోగానికి ముందు చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీ
- రేపు మధ్యాహ్నం 3 గంటల02 నిమిషాలకు నింగిలోకి వెళ్లనున్న పీఎస్ఎల్వి సీ -49
- 6 Nov 2020 6:50 PM IST
Amaravati Updates: ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్..
అమరావతి..
-"మానవత్వమే నా మతం" పుస్తకాన్ని క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన సీఎం వైయస్ జగన్
-కార్యక్రమంలో హాజరైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్ ఎన్.పద్మజ
- 6 Nov 2020 6:46 PM IST
Tirumala-Tirupati Updates: టీటీడీ ఆధీనంలోకి బూరగమంద శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి ఆలయం..
తిరుపతి..
-చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని టీటీడీలోకి విలీనం
-రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ విలీన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
- 6 Nov 2020 6:31 PM IST
Krishna District Updates: గన్నవరం మండలం గోపవరపుగూడెంలో ఘటన..
కృష్ణాజిల్లా..
- విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి, నాలుగు కోతులు మృత్యువాత..
- విద్యుత్తు తీగలు తెగిపడటమే ప్రమాదానికి కారనం
- 6 Nov 2020 6:09 PM IST
Nellore District Updates: పొదలకూరు పట్టణంలో విషాదం..
నెల్లూరు:--
-- స్నేహితులతో తెలుగు గంగ కాలువలో ఈతకు వెళ్ళి రామిశెట్టి సునీల్ కుమార్ (19 )మృతి..
-- మృతుడు నిరుపేద భవననిర్మాణ కార్మిక కార్మికుడు పోషణ కరువైన కుటుంభం..
- 6 Nov 2020 6:07 PM IST
Srikakulam District Updates: జిల్లాలో కరోనా కలకలం..
శ్రీకాకుళం జిల్లా..
* పొందూరు మండలం తాడివలసలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు..
* ఒకే రోజులో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
* 42 మంది పెద్దలకు ఒక విద్యార్థికి కరోనా నిర్ధారణ..
* తరగతులకు హాజరైన వారందరికీ కొవిడ్ పరీక్షల నిర్వహణ..
* వివాహ వేడుక కారణంగా వైరస్ వ్యాప్తి జరిగినట్లు సమాచారం..













