Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 04 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి రా.1-45 తదుపరి పంచమి | మృగశిర నక్షత్రం రా.2-36 తదుపరి
ఆర్ద్ర | వర్జ్యం ఉ.6-54 నుంచి 8-37 వరకు | అమృత ఘడియలు సా.5-11 నుంచి 6-54 వరకు | దుర్ముహూర్తం ఉ.11-22 నుంచి 12-07 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.06-02 | సూర్యాస్తమయం: సా.05-26
తాజావార్తలు
Live Updates
- 4 Nov 2020 11:00 AM IST
Amaravati Updates: PCC వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు మృతికి సంతాపం తెలిపిన ఏఐసీసీ కార్యదర్శులు..
అమరావతి..
-Pcc వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కుమారుడు మృతికి సంతాపం తెలిపిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,
-ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి ఉమన్ చాందీ,ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్,క్రిష్టొ ఫర్ , పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా .తులసిరెడ్డి
- 4 Nov 2020 10:57 AM IST
Visakha Updates: గాజువాక షీలానగర్ శ్రీవల్లి షిప్పింగ్ లో ప్రమాదం..
విశాఖ..
-రావాడ రమణ అనే కార్మికుడు పై లోడింగ్ చేస్తుండగా రామెటేరియల్ బ్యాగ్ పడి మృతి
-మృతుడు సభ్భవరం అంకటాపల్లి చెందిన వ్యక్తి
- 4 Nov 2020 10:54 AM IST
Visakha Updates: ఏజెన్సీ చింతపల్లి లో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలసిన వాల్పోస్టర్లు !
విశాఖ..
-ఏజెన్సీ చింతపల్లి లో హనుమాన్ జంక్షన్, యూనియన్ బ్యాంక్, కాఫీ బోర్డు ప్రాంతంలో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలసిన వాల్పోస్టర్లు
-మా గిరిజనులను చంపడం, మందుపాతరలు పెట్టడం తప్ప గిరిజనుల అభివృద్ధి ని ఎప్పుడైనా కోరుకోన్నారా అంటూ
-అల్లూరి ఆదివాసి అభివృద్ధి సమితి పేరిట మావోయిస్టు లకు వ్యతిరేకంగా వాల పోస్టర్లు వెలిసాయి.
- 4 Nov 2020 8:37 AM IST
CM Jagan Tour to Eluru: ఏలూరులో పర్యటించనున్న సీఎం జగన్..
పశ్చిమ గోదావరి జిల్లా...
-ఈరోజు ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు.
-ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు.
-10.35 గంటలకు ఏలూరు అల్లూరి స్టేడియానికి చేరుకుంటారు.
-అక్కడ నుంచి వీవీ నగర్ బెయిలీ బ్రిడ్జ్ సెంటర్ వద్దకు చేరుకుని అభివృద్ది పనులను ప్రారంభిస్తారు.
-అనంతరం ఏలూరు మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.
-తిరిగి ఉదయం 11.57 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు...
- 4 Nov 2020 8:32 AM IST
Somasila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 9446 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 8574 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.292 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.
- 4 Nov 2020 8:29 AM IST
International Updates: అగ్రరాజ్యం అమెరికాలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్..
అంతర్జాతీయం..
-తూర్పు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తి
-దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
-తొలుత పోలింగ్ పూర్తయిన చిన్న రాష్ట్రాల ఫలితాలు వెల్లడి .
-ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయం సాధించి తమ ఖాతా తెరిచిన ట్రంప్ , జోబైడన్.
-వెస్ట్ వర్జీనియా, కెంటకీ, ఇండియానా, సౌత్ కరోలైనా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం
-వర్జీనియా, వెర్మాంట్ రాష్ట్రాల్లో జో బైడెన్ గెలుపొందారు. టెక్సా్స్, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హాంప్షైర్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యం
- 4 Nov 2020 8:21 AM IST
Vijayawada Updates: బందరు రోడ్డు లో గల బార్బీ క్యూ రెస్టారెంట్ పై ఆహార భద్రత శాఖ దాడులు..
విజయవాడ..
-బందరు రోడ్డు లో గల బార్బీ క్యూ రెస్టారెంట్ పై ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు
-దాడిలో 15 రోజుల నుంచి నిలువ ఉంచిన మాంసం, expire అయిపోయిన పాలు, హానికరం అయిన క్రీములు లభించాయి
-యాజమాన్యం మీద కేసు నమోదు చేసిన తగిన చర్యలు తీసుకుంటాం అని అధికారులు తెలిపారు
- 4 Nov 2020 8:19 AM IST
Guntur Updates: మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఫారుక్ కి రోడ్డు ప్రమాదం..
గుంటూరు....
-గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తావల్లి కుమారుడు ఫారుక్ మృతి..
-ఫారుక్ స్నేహితుడుతో భైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం....
-భైక్ అపి ప్రక్కకు విశ్రాంతి తీసుకుండగా డీ కోట్టిన కారు....
-చౌటుప్పల్ మండలం దర్మాజీగుడెం వద్ద ఘటన....
- 4 Nov 2020 8:10 AM IST
Anantapur Updates: డిఆర్సీ లో ముగ్గురు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసిన కలెక్టర్..
అనంతపురం:
- డిఆర్సీ లో వాస్తవ నివేదికలు ఇవ్వలేదని తేలడంతో ముగ్గురు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసిన కలెక్టర్.
- ఆర్బికే ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించిన ప్రజాప్రతినిధులు. ఇంచార్జి మంత్రి బొత్సకు ఫిర్యాదు.
- వ్యవసాయ శాఖ జేడీఏ రామకృష్ణ, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ ఈఈ మహేశ్వరయ్య, హౌసింగ్ పీడీ బాల వెంకటేశ్వర రెడ్డి కి నోటీసులు జారీ.
- మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- 4 Nov 2020 8:07 AM IST
Kadapa District Updates: కందుల శివానంద రెడ్డి కన్నుమూత!
కడప :
- కడప మాజీ ఎమ్మెల్యే, కేఎస్అర్ఎం విద్యాసంస్దల అధినేత కందుల శివానంద రెడ్డి కన్నుమూత...
- ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు తో మృతి చెందిన శివానంద రెడ్డి...
- 1981-1986 శాసనమండలి సభ్యులుగా, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప శాసనసభ స్థానంలో పోటీచేసి గెలిచిన కందుల













