అల్లం, దానిమ్మ రసం రోజు తీసుకుంటే..!

అల్లం, దానిమ్మ రసం రోజు తీసుకుంటే..!
x
Highlights

కాలుష్యం అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. శ్వాస తీసుకోవడానికి కష్టంగా అనిపించడం మరియు ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి....

కాలుష్యం అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. శ్వాస తీసుకోవడానికి కష్టంగా అనిపించడం మరియు ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. చాలామంది గుండె జబ్బు బారిన పడటానికి కాలుష్యం కూడా ఒక కారణం అంటున్నారు నిపుణులు. కొన్ని ఆహారాల పదార్థాలు హానికరమైన కాలుష్యానికి వ్యతిరేకంగా వుండి శరీరం యొక్క ప్రతిఘటన శక్తిని పెంచుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ముఖ్యమైనది అల్లం. ప్రతిరోజూ తాజా అల్లాన్ని ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

అల్లం నిరంతరం మన శరీరం కాలుష్యానికి గురవడంవలన క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అల్లం లో వుండే యాంటి ఇన్ఫ్లమేటరీ మరియు క్యాన్సర్ కి కారణమైన వాటితో పోరాడుతుంది. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు మరియు ఆక్సిజన్ను గ్రహించే రక్తం యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను సులభంగా తొలగించి, దానిని అణచివేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అలాగే దానిమ్మ రసం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దానిమ్మ రసం కణాల పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. దాన్నిమ్మ రసం తాడడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది రోగనిరోధకతను పెంచుతుంది మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పండ్లలో యాంటీ-ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. ఇది మన హృదయంలో కాలుష్య ప్రభావాలను తగ్గిస్తుంది మరియు దానిలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories