జామ పండుతో ఎన్ని ప్రయోజనాలో..

జామ పండుతో ఎన్ని ప్రయోజనాలో..
x
Highlights

జామ పండుతో ఎన్ని ప్రయోజనాలో.. జామ పండుతో ఎన్ని ప్రయోజనాలో..

పండ్లు పోషకాల గనులు. వాటి వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు సమృద్దిగా లభిస్తాయి. పండ్లు కొన్ని రకాల రోగాలను నయం చేయగలవు. వాటిలో జామ పండు కూడా ఒకటి. దీన్ని తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ నుండి విముక్తి పొందవచ్చు. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. చాలా రకాల వ్యాధులు విటమిన్-సి లోపించడం వలనే వ్యాధులను వస్తాయి.

ప్రతి రోజు జామకాయ తినడం ద్వారా అలాంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు, అంతే కాకుండా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను జామకాయ దరిచేరనివ్వదని నిపుణులు తెలుపుతున్నారు.ముఖ్యంగా జామ పండులో యాంటీ-ఆక్సిడెంట్స్‌లు సమృద్థిగా ఉంటాయి. విటమిన్-సి విటమిన్-ఎ చాలా ఎక్కువ లభిస్తాయి. జామను రోజుకొకటి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.

జామపండులో పీచు పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి, దీంతో బరువును తొందరగా నియంత్రించుకోవచ్చు. జామపండులోని విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాల మెదడు చురుగ్గా పని చేయడంలో తోడ్పాడుతాయి. మెదడులోని న్యూరాన్లు సమర్థవంతంగా పని చేసేలా జామపండులోని విటమిన్లు సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories