Morning Habits: ఉదయం లేవగానే ఈ అలవాట్లు ఉన్నాయా? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే!

Are Your Morning Habits Ruining Your Health Know the Dangers
x

Morning Habits: ఉదయం లేవగానే ఈ అలవాట్లు ఉన్నాయా? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో ఉన్నట్లే!

Highlights

Morning Habits: ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ కొన్ని దినచర్యలను పాటిస్తారు. కొందరు ఉదయం లేవగానే మొబైల్ చూస్తుంటే, మరికొందరు యోగా, వ్యాయామం చేస్తూ తమ రోజును ప్రారంభిస్తారు.

Morning Habits: ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ కొన్ని దినచర్యలను పాటిస్తారు. కొందరు ఉదయం లేవగానే మొబైల్ చూస్తుంటే, మరికొందరు యోగా, వ్యాయామం చేస్తూ తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా కొందరు సానుకూలంగా తమ రోజును ప్రారంభిస్తే, మరికొందరు తమ రోజును బద్దకంతో మొదలుపెడతారు. ఈ బద్దకపు అలవాట్లు మీ రోజు మొత్తాన్ని పాడు చేయడమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే ఉదయం మీరు ఈ అలవాట్లు పాటిస్తున్నట్లయితే వాటిని ఇప్పుడే మానుకోండి.

లేవగానే మొబైల్ చూడటం: చాలామంది లేవగానే మొబైల్ చూస్తారు. గంటల తరబడి మొబైల్ చూస్తూ కూర్చుంటారు. ఈ అలవాటు ఖచ్చితంగా మంచిది కాదు. నిద్ర లేవగానే మొబైల్ చూడటం వల్ల కళ్లకు ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది. ఇది మీ ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా, ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే లేవగానే మొబైల్ చూడటం మానుకోండి. బదులుగా, అరగంట పాటు పుస్తకాలు చదవడం, ధ్యానం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి.

ఉదయం అల్పాహారం మానేయడం: కాలేజీ, ఆఫీస్‌కు ఆలస్యం అవుతుందని చాలామంది ఉదయం అల్పాహారం మానేస్తారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఎందుకంటే ఇది మధుమేహం, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇది శరీరానికి హాని చేయడమే కాకుండా, మీ మానసిక స్థితి, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఉదయం పూట ఆరోగ్యకరమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకోండి.

నీళ్లు తాగకపోవడం: ఉదయం లేవగానే నీళ్లు తాగకపోవడం మంచి అలవాటు కాదు. ఎందుకంటే రాత్రి నిద్ర తర్వాత శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఉదయం లేవగానే అలసటగా అనిపించవచ్చు. ఈ సమస్యను నివారించడానికి, మీరు లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. ఇది శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. మెదడును చురుకుగా ఉంచుతుంది.

నెగటివ్ ఆలోచనలు: కొందరు ఉదయం లేవగానే నెగటివ్ ఆలోచనలు చేస్తుంటారు. ఈ అలవాటు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదయం మీరు ఏమి ఆలోచిస్తారనేది మీ భావోద్వేగాలపై ప్రతిబింబిస్తుంది. అందుకే సానుకూలంగా ఆలోచించండి. దీనివల్ల మీ రోజు మాత్రమే కాదు, మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.

శారీరక శ్రమ చేయకపోవడం: బద్దకమైన జీవనశైలి ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే లేవగానే మొబైల్ చూడటం మానేసి, కనీసం 30 నిమిషాల పాటు యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories