Top
logo

టాప్ న్యూస్ @ 12 pm

టాప్ న్యూస్ @ 12 pm
X
Highlights

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలవరకూ ఉన్న ముఖ్య సమాచారం

తెలంగాణ రెండో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తమిళిసై సౌందర్‌ రాజన్‌

తెలంగాణ రెండో గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేసారు . రాజ్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌.. తమిళి సైతో ప్రమాణస్వీకారం చేయించారు . ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర మంత్రులు హాజరయ్యారు . తెలంగాణా తొలి మహిళా గవర్నర్ గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ గుర్తింపు సాధించారు .

తూర్పుగోదావరి జిల్లాలోని గండి పోశమ్మ ఆలయం మూసివేత

గోదావరి వరద పోటెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరులోని గండిపోశమ్మ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పోశమ్మ ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. గోదావరి నది ఒడ్డునే అమ్మవారి ఆలయం వుండటంతో క్రమంగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద తాకిడి తగ్గిన తర్వాత మళ్లీ ఆలయం తెరువనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

మాజీ కేంద్ర మంత్రి రాంజఠ్మలానీ కన్నుమూత

ప్రముఖ న్యావాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఈయన వయస్సు 98 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న జఠ్మలాని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

రాజేంద్రనగర్ లో అనుమానస్పద పేలుడు

హైదరాబాద్ సిటీ రాజేంద్ర నగర్ లో అనుమానస్పద పేలుడు సంభవించింది. ఫుట్ పాత్ పై అనుమానాస్పదంగా ఉన్న బాక్స్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి తెరిచేందుకు యత్నించడంతో ఒక్కసారిగా పేలింది.

US Open Women Finals: సెరీనా ఆశలు గల్లంతు.. ఆండ్రిస్కూ సంచలనం

ఆమె వయసు 19 ఏళ్ళు. తన ప్రత్యర్థి మొదటి టైటిల్ గెలిచేటప్పటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. అంతెందుకు.. ఈ టోర్నీ ముందు ఏ పెద్ద టోర్నీలోనూ ప్రీక్వార్టర్స్ కూ చేరలేదు. కానీ, ఏకంగా యూఎస్ ఓపెన్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది.Next Story