ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా మిగిలింది

ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా మిగిలింది
x
Highlights

చావు తప్పి కన్ను లోత్తబోవడం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారిగా అతి అవమానకరమైన ఓటమి ఇది. దాదాపు తుడిచిపెట్టుకు పోయే పరస్థితి ఎదురైంది....

చావు తప్పి కన్ను లోత్తబోవడం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారిగా అతి అవమానకరమైన ఓటమి ఇది. దాదాపు తుడిచిపెట్టుకు పోయే పరస్థితి ఎదురైంది. నిజానికి కొద్దిలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ అప్రతిహత జైత్రయాత్రలో మహా మహులైన నాయకులు ఒకపక్క మట్టి కరుస్తుంటే.. మరో పక్క ప్రతిపక్ష హోదాకి అవసరమైన 18 సీట్లు ఉంటాయా అనే అనుమానాలు రేకెత్తాయి. చివరికి 23 సీట్లు దక్కించుకుని ప్రస్తుతం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు టీడీపీ నాయకులు. అయితే, ఎంత వరకూ ఈ హోదా ఉంటుందనేది అనుమానంగానే ఉంది. ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీ కి హ్యాండ్ ఇచ్చారంటే చాలు. ప్రతిపక్ష హోదా పోయినట్టే. ఇప్పటికిప్పుడు అలా జరగకపోయినా.. భవిష్యత్ లో ఆ అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. వైసీపీ నేత కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఒకవేళ టీడీపీకి ఆ అవకాశం లేకుండా చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా టీడీపీకి మరో చావుదెబ్బ తగులుతుందని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories