ఆధార్ లో అన్ని మార్పులకూ ప్రూఫ్ అవసరం లేదు!

ఆధార్ లో అన్ని మార్పులకూ ప్రూఫ్ అవసరం లేదు!
x
Highlights

ఆధార్ కార్డులో మార్పులకు తప్పనిసరిగా ఎదో ఒక ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మార్పులకు మాత్రం ప్రూఫ్ లతో పనిలేదని భారత విశిష్ట ప్రాదికారతా సంస్థ చెప్పింది. ప్రస్తుతం ఏ మార్పు చేయాలన్నా ఎదో ఒక గుర్తింపు పత్రం తప్పనిసరి అని చెబుతున్నారు.

ఆధార్ కార్డులో మార్పులకు తప్పనిసరిగా ఎదో ఒక ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని మార్పులకు మాత్రం ప్రూఫ్ లతో పనిలేదని భారత విశిష్ట ప్రాదికారతా సంస్థ చెప్పింది. ప్రస్తుతం ఏ మార్పు చేయాలన్నా ఎదో ఒక గుర్తింపు పత్రం తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే, మొబైల్ నెంబర్, ఈమెయిల్, బయోమెట్రిక్ వంటివి మార్చుకోవాలంటే ఎటువంటి ఆధారాలూ ఇవ్వనక్కరలేదని సంస్థ స్పష్టం చేస్తోంది.

ఆధార కార్డులో ఫింగర్ ప్రింట్, జెండర్, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, ఐరిస్ స్కాన్, ఫోటో లాంటివి మార్చుకునేందుకు ఎటువంటి పత్రాలు చూపించనవసరం లేదు. కేవలం మీ అదార్ కార్డ్ తీసుకుని మీకు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళితే చాలని ఉడాయ్ అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అయితే పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్చుకోవాలంటే మాత్రం సంబంధిత పత్రాలు కావాలని ఉడాయ్ స్పష్టం చేసింది. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, పదో తరగతి సర్టిఫికేట్ ఇలా ఎదో ఒక పత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories